Revanth Reddy: పార్టీ లైన్.. గవర్నమెంట్ లైన్.. ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఎందుకంటే పార్టీ అనేదానికి బాధ్యత ఉండదు. ప్రభుత్వానికి అలా కాదు. పైగా ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి పనిని ప్రజలు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వం చాలా అణకువతో వ్యవహారించాలి. నిర్ణయాల విషయంలో జాగ్రత్త పాటించాలి.
ఆమధ్య యాదాద్రి ఆలయానికి పాలక మండలిని రేవంత్ నియమించాడు.. ఈ పాలకమండలిలో చిరంజీవి సతీమణికి కూడా చోటు కల్పించాడు. ఇక అక్కడ మొదలైంది జగడం. భారత రాష్ట్ర సమితి నానా యాగి చేయడం మొదలుపెట్టింది. కొంతమంది వీర తెలంగాణవాదులు తెరమీదకి వచ్చారు. యాదాద్రి గుడిని రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నాడని శాపనార్ధాలు పెట్టారు. ఇక హస్తం పార్టీలో ముఖ్యమంత్రి విరోధులకు గురించి చెప్పాల్సిన పనిలేదు.ఇదే సమయంలో దొరకిందే సందుగా సొంత పార్టీ నాయకులు కూడా రేవంత్ తీరు మీద అడ్డగోలుగా నెగిటివ్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
ఇది కాస్త మీనాక్షి నటరాజన్ చెవిలో పడింది. ఇంకేముంది ఆమె మీటింగ్ పెట్టింది. తెలంగాణలో ఏ సమస్య లేనట్టు.. తెలంగాణలో యాదగిరిగుట్ట పాలకమండలి నియామకమే పెద్ద సమస్య అయినట్టు చర్చ మొదలుపెట్టింది.. ఈ మీటింగ్ కు రేవంత్ రెడ్డి.. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. ఇంకా చాలామంది హాజరయ్యారు. ఎవరికి తోచింది వారు చెప్పారు. మొత్తానికి రేవంత్ పాలకమండలి విషయంలో తొందర పడ్డారని ఇన్ డైరెక్ట్ గా వ్యాఖ్యానించారు.
వాస్తవానికి పాలకమండలిలో డబ్బున్న వాళ్లకు ప్రయారిటీ ఇచ్చింది.. గుడి డెవలప్మెంట్ కు ఎంతో కొంత సహాయం చేస్తారని.. వాళ్ల ద్వారా ఆలయానికి ఎంతో కొంత వస్తుందని.. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి దాచుకోలేదు. ఓపెన్ గానే చెప్పేశాడు. పైగా ఒక ముఖ్యమంత్రిగా తనకు ఆమాత్రం స్వేచ్ఛ కూడా లేకపోతే ఎలా.. ప్రతి విషయంలో అధిష్టానం ప్రవేశించి.. నెత్తి మాసిన రాజకీయాలు చేస్తే ఇదిగో ఇలానే ఉంటుంది. అసలే కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలపాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉంది.. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులను చికాకు పెట్టి.. కాళ్లలో కట్టెలు పెడితే.. చివరికి మునిగేది కాంగ్రెస్ పార్టీనే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో.. కర్ణాటక.. కేరళ లో మాత్రమే కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రాలలో అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కోల్పోతే కాంగ్రెస్ పార్టీకి మిగిలేది చేతికి చెప్పే. ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఇదే నిజం.