Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: విఫలమైన ఆటో రాంప్రసాద్.. మరో టాప్ కమెడియన్ ని వైల్డ్...

Bigg Boss 10 Telugu: విఫలమైన ఆటో రాంప్రసాద్.. మరో టాప్ కమెడియన్ ని వైల్డ్ కార్డు గా తీసుకొని రానున్న ‘బిగ్ బాస్ 10’ టీం!

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి భారీ అంచనాల నడుమ ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లో ఒకరు ఆటో రామ్ ప్రసాద్. అసలు ఈయన బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో లోకి వస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే బుల్లితెర పై టాప్ మోస్ట్ కమెడియన్స్ లో ఈయన కూడా ఒకరు. సినిమాల్లో కూడా అవకాశాలు ఈమధ్య బాగానే వస్తున్నాయి. అలాంటి సెలబ్రిటీ బిగ్ బాస్ కి వస్తున్నాడంటే […]

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి భారీ అంచనాల నడుమ ఎంట్రీ ఇచ్చిన సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లో ఒకరు ఆటో రామ్ ప్రసాద్. అసలు ఈయన బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో లోకి వస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే బుల్లితెర పై టాప్ మోస్ట్ కమెడియన్స్ లో ఈయన కూడా ఒకరు. సినిమాల్లో కూడా అవకాశాలు ఈమధ్య బాగానే వస్తున్నాయి. అలాంటి సెలబ్రిటీ బిగ్ బాస్ కి వస్తున్నాడంటే ఎంటర్టైన్మెంట్ అదిరిపోతోంది అంతా అనుకున్నారు. ఎందుకంటే జబర్దస్త్ లో ఆయన రాసిన స్కిట్స్ , వేసిన పంచులు ఆ రేంజ్ లో పేలాయి కాబట్టి. ఒక విధంగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వంటి వారు నేడు ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు పరోక్ష కారణం ఆటో రామ్ ప్రసాద్ , అందులో ఎలాంటి సందేహం లేదు.

అయితే గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ శాతం చాలా తక్కువ అయ్యింది. ఆటో రామ్ ప్రసాద్ ఆశించిన స్థాయిలో కామెడీ చేయడం లేదు. నరేష్ కాస్త ప్రయత్నం చేస్తున్నాడు కానీ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. అందుకే వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ జాబితాలో మరో పాపులర్ కమెడియన్ నూకరాజు ని తీసుకొస్తున్నారట మేకర్స్. కనీసం ఇప్పుడైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుందో లేదో చూడాలి. నూకరాజు కచ్చితంగా ఇమ్మానుయేల్ రేంజ్ కంటెస్టెంట్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. అద్భుతంగా కామెడీ చెయ్యగలడు , అదే సమయం లో టాస్కులు కూడా అద్భుతంగా ఆడగలడు. ఇక నామినేషన్స్ సమయం లో అయితే చిరుతపులి లాగా విరుచుకుపడుతాడు , సరైన పాయింట్స్ తో దుమ్ము లేపేస్తాడు. ఆయన పెర్ఫార్మన్స్ ఎలాంటిదో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షోలో మనమంతా చూసే ఉంటాము. కచ్చితంగా ఇతను రాబోయే వైల్డ్ కార్డ్స్ లో బలమైన ప్రభావం చూపించగలడు అని చెప్పొచ్చు.

వాస్తవానికి నూకరాజు ని గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారానే తీసుకుందామని అనుకున్నారు. కానీ ఆటో రామ్ ప్రసాద్ లాంటి టాప్ కంటెస్టెంట్ ఈ షో లో పాల్గొనేందుకు ఒప్పుకున్నాడు కాబట్టి , నూకరాజు ని తీసుకోలేదు. కానీ ఇప్పుడు షో లో ఇసుమంత ఎంటర్టైన్మెంట్ కూడా కనిపించడం లేదు. అందుకే నూకరాజు ని తీసుకొని రావాలని బిగ్ బాస్ టీం ప్రయత్నం చేస్తోంది. ఈయనతో పాటు నటరాజ్ మాస్టర్ సతీమణి నీతూ, ఈషా బ్లాగ్స్ (స్నో అక్క) కూడా వైల్డ్ కార్డ్స్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఒప్పుకున్నారట. అక్టోబర్ 11 న ఈ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper