Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం నుండి రోహిత్, త్రిగున్ మధ్య ఏ రేంజ్ లో మాటల యుద్ధం జరుగుతూ వస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా త్రిగున్ అయితే అన్నీ లిమిట్స్ ని దాటి రోహిత్ ని వ్యక్తిగతంగా అనరాని మాటలు అన్నాడు. ఈ వారం అయితే త్రిగున్ రోహిత్ పై ఏ రేంజ్ లో మాటలు జారాడో మనమంతా చూశాము. అలాంటి త్రిగున్ హౌస్ లో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అని రామ్ ప్రసాద్ అడిగితే, క్షణం కూడా ఆలోచించకుండా రోహిత్ పేరు చెప్తాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రతీ వారం ఆటో రామ్ ప్రసాద్ , నరేష్ లు కలిసి రివ్యూయర్స్ ని ఇమిటేట్ చేస్తూ , హౌస్ లోని కంటెస్టెంట్స్ తో ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది చాలా ఫన్నీ గా ఉంటుంది , ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది.
గతం లో రోహిత్ ని కూడా వీళ్లిద్దరు ఇంటర్వ్యూ చేశారు. ఈ వారం వీళ్ళు త్రిగున్ ని ఇంటర్వ్యూ చేశారు. అందులో భాగంగా హౌస్ లో మీకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అని అడిగితే రోహిత్ పేరు చెప్తూ ‘ అతనితో నాకు గొడవలు ఉన్నప్పటికీ, అనేక సందర్భాల్లో నిజాయితీ గా వ్యవహరించడం నేను చూశాను, అందుకే అతను నా ఫేవరేట్’ అంటూ చెప్పుకొచ్చాడు. గతం లో రోహిత్ కూడా త్రిగున్ గురించి తన స్నేహితులతో చాలా గొప్పగా చెప్తాడు. అతనితో నాకు గొడవలు ఉన్న విషయం వాస్తవమే కానీ , మంచి గేమర్ , కచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు చూసుకోండి అని ఎలివేషన్ వేస్తాడు. ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు త్రిగున్ రోహిత్ గురించి మాట్లాడిన వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది. పరోక్షంగా వీళ్లిద్దరికీ తమ మధ్య మాత్రమే టైటిల్ రేస్ ఉండబోతుంది అనే విషయం అర్థం అయిపోయింది. మరి ముకేశ్ సంగతి ఏంటి?, రాబోయే వారాల్లో ఈయన వీళ్లిద్దరికీ పోటీ ఇచ్చి టైటిల్ రేస్ లోకి వస్తాడా లేదా అనేది చూడాలి.