Rohit Sharma Vacation: ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ అదరగొట్టాడు. ఏకంగా సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లో అతడికి చోటు లభించదు అని నెగిటివ్ ప్రచారం జరుగుతున్న వేళ.. తాను సింహం లాంటోడినని.. బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగితే పరుగులు ప్రవాహం లాగా రావాలని నిరూపించాడు. అంతేకాదు తనమీద నెగిటివ్ ప్రచారం చేస్తున్న వారందరికీ ఒకే ఒక్క ఇన్నింగ్స్ ద్వారా గట్టి సమాధానం చెప్పాడు.
ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ వెంటనే వెకేషన్ వెళ్ళిపోయాడు. భార్యా పిల్లలతో కలిసి ప్రస్తుతం అతడు ఫారిన్ టూర్ ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో కలిసి ఆటలాడుతున్నాడు. భార్యతో కలిసి ఫోటోలు దిగుతున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఎప్పటికప్పుడు తన అభిమానులకు అందుబాటులో ఉండే విధంగా సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు. వాస్తవానికి రోహిత్ కంప్లీట్ ఫ్యామిలీ మెన్. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అయితే ఆట.. లేకుంటే కుటుంబం.. ఇలానే సాగుతుంది అతడి వ్యవహారం. పార్టీలకు పెద్దగా హాజరుకాడు. పైగా కుటుంబ సభ్యులతో గడపడాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు.
సాధారణంగా రోహిత్ వెకేషన్ మూడ్ లో ఉన్నప్పుడు.. పూర్తిగా చిల్ అవుతూ ఉంటాడు. తన మీద ఉన్న ఒత్తిడి మొత్తం తగ్గించుకుంటాడు. ఆ సమయంలో కుటుంబానికి ప్రయారిటీ ఇస్తూ ఉంటాడు. పిల్లలతో కలిసి ఆటలాడుకుంటాడు. ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల రోహిత్ పూర్తిస్థాయిలో సంసిద్ధుడుగా ఉంటాడు. ఇప్పుడు రోహిత్ కు కావాల్సింది పూర్తిస్థాయిలో సామర్థ్యం. పైగా అతడు ఒకప్పటి మాదిరిగా సూపర్ ఫామ్ లోకి వచ్చేసాడు. బంతి కనిపిస్తే చాలు బలంగా కొట్టేస్తున్నాడు. తన వింటేజ్ రూపం ఎలా ఉంటుందో ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్ లో నిరూపించాడు.
2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పుడే టీమిండియా సన్నాహాలు ప్రారంభించిన నేపథ్యంలో రోహిత్ తన మునుపటి రూపాన్ని చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికంటే ముందుగానే కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. విహారయాత్ర ముగిసిన తర్వాత మళ్లీ అతడు బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగుతాడు. ఈసారి తన 2.0 చూపించడానికి రోహిత్ సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రకారం చూసుకుంటే రోహిత్ వెకేషన్ ప్లాన్ చేసింది.. కేవలం చిల్ అవ్వడానికి కాదని.. అంతకుమించి చేయడానికి సంకేతాలు ఇస్తున్నాడు. ఒకవేళ కనుక రోహిత్ సింహంలాగా రెచ్చిపోతే.. దక్షిణాఫ్రికా మైదానాల మీద వీరవిహారం చేస్తే.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లభించినట్టే. ఎందుకంటే టీమిండియా కు 2027లో వన్డే వరల్డ్ కప్ ఇవ్వాలని.. అది ఇచ్చి రిటర్మెంట్ తీసుకోవాలని రోహిత్ గట్టి ప్లాన్ తో ఉన్నాడు.
Rohit Sharma enjoying the vacation with his wife – A lovely picture ❤️ pic.twitter.com/kCpZlOrOYy
— Johns. (@CricCrazyJohns) July 27, 2026