Homeఆంధ్రప్రదేశ్‌Tulasi Chandu Vs Racha Ramulamma: తులసి చందు.. రాములమ్మ.. సోషల్ మీడియాలో ఏందీ పంచాయితీ

Tulasi Chandu Vs Racha Ramulamma: తులసి చందు.. రాములమ్మ.. సోషల్ మీడియాలో ఏందీ పంచాయితీ

Tulasi Chandu Vs Racha Ramulamma: ఇద్దరు మహిళలకు అహం దెబ్బతింటే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. అవి ఎంతటి ఘటనలకైనా దారి తీస్తాయి. ఈ ఇద్దరు మహిళల విషయంలో కూడా అదే జరిగింది. ఎవరూ తగ్గడం లేదు. ఎవరికివారు వ్యవస్థలను నిర్వహిస్తుండడంతో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు. చూసేవాళ్ళకు వందశాతం ఎంటర్టైన్మెంట్ ఫ్రీగా అందిస్తున్నారు. ఆ ఇద్దరు మహిళల్లో ఒకరి పేరు తులసి చందు. మరో మహిళ పేరు రచ్చ రాములమ్మ. వీరిద్దరికి మీడియాలో […]

Tulasi Chandu Vs Racha Ramulamma: ఇద్దరు మహిళలకు అహం దెబ్బతింటే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. అవి ఎంతటి ఘటనలకైనా దారి తీస్తాయి. ఈ ఇద్దరు మహిళల విషయంలో కూడా అదే జరిగింది. ఎవరూ తగ్గడం లేదు. ఎవరికివారు వ్యవస్థలను నిర్వహిస్తుండడంతో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నారు. చూసేవాళ్ళకు వందశాతం ఎంటర్టైన్మెంట్ ఫ్రీగా అందిస్తున్నారు.

ఆ ఇద్దరు మహిళల్లో ఒకరి పేరు తులసి చందు. మరో మహిళ పేరు రచ్చ రాములమ్మ. వీరిద్దరికి మీడియాలో పనిచేస్తున్న అనుభవం ఉంది.. పైగా ఇద్దరు కూడా సొంతంగా యూట్యూబ్ చానల్స్ ఏర్పాటు చేసుకున్నారు. వాటి ద్వారా తమ అభిప్రాయాలను బయటపెడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఒకరి గురించి మరొకరు చెప్పుకొని పలుచన అవుతున్నారు. ఒకరేమో జాతీయవాద జర్నలిస్ట్ అని చెప్తుంటే.. ఇంకొకరేమో మతానికి వ్యతిరేకంగా.. చాందసవాదానికి వ్యతిరేకంగా పనిచేసే జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు.

తులసి చందు మొదటి నుంచి నరేంద్రమోడీకి వ్యతిరేకి. ఆమె స్టోరీలు కూడా అలానే ఉంటాయి. రావణ్ కు అనుకూలంగా ఉన్న కథనాలు కనిపిస్తాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.. హిందువులు.. ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి అంశం కూడా తులసి చానల్లో కనిపిస్తూ ఉంటుంది. దీనిని బట్టి ఆమె వాయిస్ ఎలాంటిది.. ఆమె నేపద్యం ఎలాంటిది అర్థం చేసుకోవచ్చు.

రచ్చ రాములమ్మ తులసి చందుకు పూర్తి విభిన్నం. ఈమె మోడీ గురించి సానుకూలంగా మాట్లాడుతుంటారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మీద.. ఇతర మతాల మీద నెగిటివ్ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇటీవల తులసి చందు కు వ్యతిరేకంగా అనేక కథనాలను రూపొందించారు. ఇప్పటికీ రూపొందిస్తూనే ఉన్నారు. పైగా వాటికి రీచ్ కూడా ఎక్కువగా లభించింది.

ఈ వీడియో తులసికి చేరిందేమో.. ఆమె కూడా రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టింది. తను కూడా డ్రాములమ్మ.. ఆమె సిరీస్తో వీడియోలు చేయడం ప్రారంభించింది. వీరిద్దరూ ఒకరికి వ్యతిరేకంగా మరొకరు వీడియోలు చేయడంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది. వీరిద్దరూ పోటాపోటీగా వీడియోలు చేయడంతో సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. ఎవరి వర్గాలు వారికి ఉండడంతో.. సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. మరి ఈ యుద్ధానికి ముగింపు ఎప్పుడు.. తులసి చందు వైపు నుంచి వామపక్ష భావజాలం ఉన్నవారు.. రచ్చ రాములమ్మ వైపు నుంచి నరేంద్ర మోడీ రావాలి. వీరిద్దరి తరఫున చర్చలు జరపాలి. కాల్పుల విరమణ ఒప్పందానికి శ్రీకారం చుట్టాలి. అప్పుడుగాని వీరిద్దరి మధ్య యుద్ధం ఆగదు. కానీ వీరు చేస్తున్న వీడియోల ద్వారా ఇస్తున్న వినోదం మెయిన్ చానెల్స్ వల్ల కూడా కాదు. ఎందుకంటే వీరిద్దరి వీడియో చూస్తే తెలుస్తుంది మజా.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper