Homeక్రీడలుక్రికెట్‌Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి సిరీస్ లోనే తెలిసిపోతుంది. కానీ ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్ అట్టర్ ప్లాఫ్. అతడు 2024లో ఐపీఎల్ టోర్నీ జరిగినప్పుడు కోల్కతా జట్టును విజేతగా నిలిపి ఉండవచ్చుగక. కానీ అదేమీ అంతర్జాతీయ స్థాయి టోర్నీ కాదు. కేవలం ఒక క్రికెట్ లీగ్ మాత్రమే. వాపును […]

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి సిరీస్ లోనే తెలిసిపోతుంది. కానీ ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్ అట్టర్ ప్లాఫ్. అతడు 2024లో ఐపీఎల్ టోర్నీ జరిగినప్పుడు కోల్కతా జట్టును విజేతగా నిలిపి ఉండవచ్చుగక. కానీ అదేమీ అంతర్జాతీయ స్థాయి టోర్నీ కాదు. కేవలం ఒక క్రికెట్ లీగ్ మాత్రమే. వాపును చూసి బలుపు అనుకున్నారు.. అతడు కోల్కతా జట్టును విజేతగా నిలపడంతో.. 2026 లో టీమిండియా టి20 కెప్టెన్ ను చేసి పడేశారు. 2024లో కోల్కతా ను విజేతగా నిలిపిన అతడు.. 2025లో పంజాబ్ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. కానీ 2026 లో పంజాబ్ జట్టు ను గ్రూప్ దశ కూడా దాటించలేకపోయాడు. ఈ విషయాన్ని మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. గుర్తించకుండా మానేసింది. చివరికి గుడ్డెద్దు చేలో పడ్డట్టు శ్రేయస్ అయ్యర్ ను తీసుకొచ్చి సారధిని చేసింది.

ఇంగ్లాండ్ గడ్డమీద జరిగిన టి20 సిరీస్ లో టీమిండియా ఓడిపోయింది. అంతకుముందు ఐర్లాండ్ జట్టుతో జరిగిన సిరీస్ లోను టీం ఇండియా ఓడిపోయింది. అసలు టీమిండియా ఇలాంటి ఆట ఆడుతుందని.. ముఖ్యంగా టి20 ఫార్మేట్ లో ఇంత చెత్త ప్రదర్శన చేస్తుందని ఏ ఆటగాడు కూడా ఊహించలేదు. ఏ అభిమాని కూడా అంచనా వేయలేదు. పైగా ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ ఉంటే సిగ్గుతో తలదించుకోవాలి. సూర్య కుమార్ యాదవ్ ఆటగాడిగా విఫలమైనప్పటికీ.. నాయకుడిగా అతడు విఫలం కాలేదు. దక్షిణాఫ్రికా నుంచి మొదలుపెడితే ఆస్ట్రేలియా వరకు ప్రతి జట్టు మీద సిరీస్ గెలిపించుకుంటూ వచ్చాడు. చివరికి టి20 వరల్డ్ కప్ కూడా భారత జట్టుకు అందించాడు. అటువంటి సారధిని మేనేజ్మెంట్ పక్కన పెట్టడం.. కనీసం ఆటగాడిగా కూడా ఎంపిక చేయకపోవడం కోచ్.. ఇతర సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట.

ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడం.. ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం వంటి పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే మేనేజ్మెంట్ మూర్ఖత్వం ఎలా ఉందో అర్థం అవుతుంది. అయినప్పటికీ ఆ వైఫల్యాలను ఒకలిట్మస్ టెస్ట్ లాగా ఇప్పటికీ మేనేజ్మెంట్ చూడలేకపోతోంది. చివరికి అయ్యర్ కూడా ఆ ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకున్నానని చెబుతున్నాడు. కానీ అతడికి గుణపాఠం చెవికి ఎక్కలేదు. ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ లో ట్రోఫీ డిసైడింగ్ మ్యాచ్లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. అతడు గనుక నిలబడి ఉంటే టీమిండియా కచ్చితంగా గెలిచి ఉండేది. కానీ నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేసి మూల్యాన్ని చెల్లించుకున్నాడు. పైగా ఇప్పుడేమో పతిత్తు కబుర్లు చెబుతున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి గుణపాఠం నేర్చుకున్నామని అంటున్నాడు. ఒకవేళ అతడి గనుక ఆ పాఠం నేర్చుకుని ఉండి ఉంటే టీమిండియా కు వన్డే సిరీస్లో ఓటమి ఉండేది కాదు. ఇప్పటికైనా అయ్యర్ తనను తాను గొప్పగా ఊహించుకోవడాన్ని పక్కనపెట్టి వాస్తవంలోకి రావాలి. అవసరమైతే తన సారధ్య బాధ్యతను పక్కనపెట్టాలి. ఎందుకంటే ఒక ఆటగాడికి జట్టు కంటే ఏది గొప్ప కాదు. అదే వైఫల్యాల చరిత్రను పట్టుకుని వేలాడితే.. టీమిండియా పరువు పోతుంది. అయ్యర్ చరిష్మా మరింత దిగజారుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper