SS Rajamouli: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి విస్తరింపజేస్తున్న దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుండటం విశేషం… ప్రస్తుతం ఆయన ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమా 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో 20% షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. దాంతో సెప్టెంబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్టోబర్ నెల నుంచి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరగబోతుందట. ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసి ఎలాగైనా సరే పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కువ సమయాన్ని కేటాయించాలని రాజమౌళి చూస్తున్నారట.
అనుకున్న సమయానికి థియేటర్లోకి సినిమాని తీసుకురావడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. రీసెంట్ గా క్రిస్టోఫర్ నోలన్ తీసిన ది ఒడిస్సీ సినిమాని సైతం ఆయన అనుకున్న డేట్ కి రిలీజ్ చేశాడు. దాంతో రాజమౌళి సైతం విషయాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని తను కూడా రిలీజ్ డేట్ కి కట్టుబడి ఉండి అదే డేట్ కి తన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం ప్రపంచ స్థాయి ప్రేక్షకులు సైతం రాజమౌళి అభిమానులుగా మారే అవక్షమైతే ఉంటుంది. హాలీవుడ్ లో ఉన్న దర్శకులకు సైతం పోటీగా మారే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఏదేమైనా కూడా ‘వారణాసి’ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధిస్తుందని అభిమానులైతే కోరుకుంటున్నారు.
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీని దాటి బయటికి వెళ్లలేని మహేష్ బాబు ఏకంగా హాలీవుడ్ ఇండస్ట్రీని సైతం టచ్ చేసే స్థాయికి వెళ్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ఈ సినిమా తర్వాత ఏ హీరోతో సినిమా చేస్తాడు అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న…