Small Artists Remuneration: సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం బయట నుంచి చూసే వాళ్లకి అన్ని రంగులు కనిపిస్తాయి. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి మాత్రం వాళ్ళ మనుగడ కూడా చాలా కష్టమవుతుంది. స్క్రీన్ మీద కనిపించే కొంత మందినాని చూసే మనం ఇండస్ట్రీ అనుకుంటాం. వాళ్లే సినిమా ఇండస్ట్రీ అంటే అని మనం అందరం అనుకుంటాం. కానీ దాని వెనక ఎంతోమంది కష్టపడాల్సిన అవసరమైతే ఉంది. చిన్న చిన్న ఆర్టిస్టులు ఒక వేషం దొరికితే బాగుండని బాధపడిన సందర్భాలు చాలానే ఉంటాయి. ఇలాంటి క్రమంలోనే కొన్ని పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు సైతం హీరోలకు వందల కోట్ల రెమ్యూనరేషన్స్ ఇస్తున్నారు. చిన్న ఆర్టిస్టులు సైతం ఆదుకుంటున్నారు. కానీ ఇంకొన్ని పెద్ద నిర్మాణ సంస్థలు మాత్రం స్టార్ హీరోలకు ఇవ్వాల్సినవి ఇచ్చేసి, చిన్న చిన్న ఆర్టిస్టులకు ఇవ్వాల్సిన డబ్బులను ఎగ్గోడుతున్నారు అంటూ చాలామంది చిన్న ఆర్టిస్టులు వాళ్ళ అభిప్రాయాలను ఏదో ఒక చోట చెబుతూ వాళ్ల బాధలను ఇతరులతో పంచుకుంటున్నారు. డబ్బులు ఇవ్వలేదు అని చెబితే ఆ బ్యానర్ లో మరో సినిమా చేసే అవకాశం ఇవ్వరేమో అనే ఉద్దేశ్యంతో ఆ చిన్న నటులు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సినిమాల్లో కనిపించాలి.
ఈ సినిమాలో ఒక మంచి పాత్ర దొరికితే దానివల్ల ఇంకా కొన్ని మంచి పాత్రలు చేసే అవకాశం వస్తుందేమో అనే ధోరణిలోనే ఉంటున్నారు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా అల్టిమేట్ గా వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ప్రొజెక్ట్ చేసుకోవడమే నటుల యొక్క టార్గెట్…
ప్రొడక్షన్ హౌస్ లు మాత్రం ఇలాంటి నటులకు సరైన పాత్రలను ఇవ్వక, వాళ్లకు డబ్బులు ఇవ్వక రెండు రకాలుగాను వాళ్లకు అన్యాయం చేస్తున్నారు అంటూ మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో పేరు మోసిన నటులకు మాత్రమే పెద్ద మొత్తంలో అమౌంట్ ని ఇస్తున్నారు.
చిన్న చితక పాత్రలు చేసేవాళ్లను మాత్రం ఎవ్వరు పట్టించుకోవడంలేదనే వాస్తవం… ప్రొడక్షన్ హౌస్ లు సైతం మారాల్సిన అవసరమైతే ఉంది. ఇలా చేస్తే సినిమా ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన కూడా చాలా మందిలో చచ్చిపోతుంది అంటూ మరి కొంతమంది సినిమా విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం…