India vs Sri Lanka Test Series: పెద్దగా మార్పులు లేవు. అలాగని నేల విడిచి సాము చేయలేదు. ఇప్పటికిప్పుడు సిరీస్ విజయం కావాలి. ఆ విజయం భారీ తేడాతో దక్కాలి. అప్పుడే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఆశలు సజీవంగా ఉన్నప్పటికీ.. అవి సరిపోవు. అంతకుమించి అనే రేంజ్ లో గెలుపు దక్కాలి. అది జరగాలంటే ప్లేయర్లు సూపర్ ఆట తీరుకొని సాగించాలి. ఇవన్నీ మనసులో పెట్టుకొని టీమిండియా శ్రీలంక సిరీస్ కు అదిరి పోయే రేంజ్ లో గేమ్ ప్లాన్ రూపొందించింది.
శ్రీలంక జట్టుతో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇందులో కెప్టెన్ గా గిల్.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కొనసాగుతారు. మీరు మాత్రమే కాకుండా సారాంషి జైన్.. దేవదత్ పడికల్, సాయి సుదర్శన్, జూరెల్, జడేజా, కులదీప్ యాదవ్, సుతార్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్, గుర్నూర్ వంటి వారికి చోటు కల్పించింది. సుందర్ గాయం వల్ల చోటు దక్కించుకోలేకపోయాడు.
వాస్తవానికి యంగ్ ప్లేయర్లకు కాకుండా.. మొత్తం సీనియర్లకు మాత్రమే మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. ఇలా అవకాశం ఇవ్వడం వెనక ఓ బలమైన కారణం ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లాలంటే టీమిండియా కచ్చితంగా శ్రీలంక సిరీస్ లో గెలవాలి. సిరీస్ గెలుపు దక్కాలంటే.. జట్టులో సమర్థవంతమైన ప్లేయర్లు ఉండాలి.. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో భారత జట్టు గెలిచినప్పటికీ.. ఈ గెలుపు సరిపోదు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడానికి టీమిండియా శ్రీలంక.. ఆ తదుపరి సిరీస్ లు కూడా గెలవాలి.. అది జరగాలంటే జట్టులో సమర్థవంతమైన ప్లేయర్లు ఉండాలి. అందువల్లే శ్రీలంక సిరీస్ కోసం టీమిండియా ఫామ్ లో ఉన్న ప్లేయర్లకే అవకాశం కల్పించింది.
ప్రస్తుతం జట్టులో గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. రాహుల్ తన సామర్థ్యం నిరూపించుకోవాలి. సిరాజ్ ఆకలిగా ఉన్న పులి మాదిరిగా ఉన్నాడు. బుమ్రా సత్తా చూపించుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా ప్లేయర్లు కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే టీమిండియా లంక దహనాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతుంది. అది కనక పూర్తి అయితే టీమిండియా కు కొండంత బలం లభిస్తుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి దర్జాగా దూసుకుపోతుంది. అందువల్లే మేనేజ్మెంట్ ఈసారి జట్టు ప్రకటన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది.