Star Heroines Remuneration: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికి కొందరు మాత్రమే తమ సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. హీరోలతో పాటు పోటీ పడి హీరోయిన్లు సైతం భారీ రేంజ్ లో గుర్తింపును సంపాదించుకుంటున్నారు. పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారు… హీరోలతో పాటు పోటీపడి మరి వాళ్ళు పారితోషికాన్ని ఛార్జ్ చేస్తున్నారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వారణాసి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా ఈ సినిమా కోసం 25 నుంచి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ని తీసుకుంటుంది. ఈ సినిమాలో తనది కీలక పాత్ర కావడంతో ఆమెకు హాలీవుడ్లో సైతం మంచి గుర్తింపు ఉండడంతో ఆమెను ఈ సినిమాలో భాగం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే రాజమౌళి ఏదో చేసిన ఒక ప్రణాళిక బద్ధంగా చేస్తాడు. కాబట్టి అందుకే ఆమెను కూడా ఈ సినిమాలో భాగం చేశారట…
ఇక ఈమె తర్వాత పొజిషన్లో దీపిక పదుకొనే ఉంది. ఆమె ఒక సినిమా కోసం 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇక వీళ్ళిద్దరి తర్వాత అలియా భట్ 20 కోట్ల వరకు పారితోషికాన్ని ఛార్జ్ చేస్తుండటం విశేషం… ఇక సౌత్ విషయానికి వస్తే నయనతార, త్రిష లాంటి హీరోయిన్లు 10 కోట్ల వరకు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం వీళ్ళిద్దరూ సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా మారారు. అందుకోసమే అంత మొత్తంలో రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్లకు తమిళ్ తెలుగులో మంచి మార్కెట్ ఉండడం కూడా వాళ్లకు రెమ్యూనరేషన్ ఎక్కువ తీసుకోవడానికి హెల్ప్ అవుతుందనే చెప్పాలి…రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ టాప్ పొజిషన్ కి వెళుతుంది.
కాబట్టి సౌత్ భామలు కూడా ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ని ఛార్జ్ చేసే అవకాశాలైతే ఉన్నాయంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…చూడాలి మరి రాబోయే రోజుల్లో మన స్టార్ హీరోయిన్స్ ఏ రేంజ్ లో ఛార్జ్ చేస్తారు అనేది…