CM Vijay Son: ఒక స్టార్ హీరో కొడుకు స్టార్ అవ్వాల్సిన పనిలేదు. ఏదైనా అవ్వొచ్చు. వాళ్లకు ఇష్టమున్న క్రాఫ్ట్ లో నైపుణ్యం చూపించొచ్చు. కానీ అభిమానులు మాత్రం అలా కోరుకోరు , కచ్చితంగా హీరో గా ఎంట్రీ ఇవ్వాల్సిందే, తన తండ్రి లేజసీ ని ముందుకు తీసుకొని వెళ్లాల్సిందే అని డిమాండ్ చేస్తుంటారు. ఇప్పుడు తమిళ హీరో విజయ్ విషయం లో కూడా అదే జరుగుతోంది. ఇతని కొడుకు జేసన్ సంజయ్ హీరో గా కాకుండా, డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మన టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన సందీప్ కిషన్ ని హీరో గా పెట్టి , ఆయన ‘సిగ్మా’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే విజయ్ ఫ్యాన్స్ కి జేసన్ సంజయ్ హీరో గా ఎంట్రీ ఇవ్వడం కావాలి.
తన తండ్రి తిరుగులేని లేజసీ ని సంజయ్ కొనసాగిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. కానీ సంజయ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నందుకు ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. అయితే లేటెస్ట్ గా కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ఏంటంటే, జేసన్ సంజయ్ హీరో గా ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని విధాలుగా రూట్ మ్యాప్ ని రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఒక పాపులర్ పాన్ ఇండియన్ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నారట. ఈ చిత్రాన్ని ‘పరిమళం & కో’ సంస్థ అధినేత కుమారన్ నిర్మించబోతున్నారట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఇది విజయ్ ఫ్యాన్స్ కి ఒక పండుగ లాంటి వార్త అనే చెప్పాలి. అదే విధంగా కోలీవుడ్ కి కూడా ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే విజయ్ సీఎం అయ్యాక సినిమాలకు శాశ్వతంగా దూరం అయ్యారు.
ఇక విజయ్ తో సరిసమానమైన స్టార్ స్టేటస్ ఉన్నటువంటి అజిత్ కూడా సినిమాలకు దూరమై , రేసింగ్ వైపు ద్రుష్టి సారించారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ కి బాగా వయస్సు వచ్చేసింది. కుర్ర హీరోలెవ్వరికీ కూడా స్టార్ స్టేటస్ లు లేవు. సూర్య ఒక్కరే ఫార్మ్ లో ఉన్నారు , ఇక ఆయన సినిమాల మీదనే తమిళ సినిమా ఇండస్ట్రీ ఆధారపడింది , ఆయన సినిమాలు లేకపోతే థియేటర్స్ ఖాళీగా ఉంచుకోవాల్సిందే అనే బాధలో ఉన్నారు విశ్లేషకులు. సరిగ్గా అలాంటి సమయం లో విజయ్ కొడుకు హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త రావడం తో ఇప్పుడు అక్కడి ట్రేడ్ ఊపిరి పీల్చుకుంది. సరైన కాంబినేషన్స్ తో సంజయ్ సినిమాలను సెట్ చేసుకుంటే , తన తండ్రి స్థానాన్ని అవలీలగా ఆక్రమించగలడు అంటూ సోషల్ మీడియా లో విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
