Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli: వీర విరాట్.. సచిన్ రికార్డు బద్దలు

Virat Kohli: వీర విరాట్.. సచిన్ రికార్డు బద్దలు

Virat Kohli: టి20లకు వీడ్కోలు పలికాడు. టెస్టులకు గుడ్ బాయ్ చెప్పాడు. వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. వయసు కూడా 38 దాటిపోయింది. అయినప్పటికీ అతడిలో ఆ జోరు తగ్గడం లేదు. మైదానం మారింది. ప్రత్యర్థి మారింది. కానీ అతని బ్యాటింగ్ మాత్రం మారడం లేదు. బంతులు వేసి బౌలర్లకు అలుపు వస్తోంది. అతడికి మాత్రం ఊపు మరింత పెరుగుతోంది. అతని ఆట చూస్తే అసలు ఇక్కడికి వయసు అనేది రాదా.. ఇతడు ముసలాడు కాదా.. కొట్టి కొట్టి […]

Virat Kohli: టి20లకు వీడ్కోలు పలికాడు. టెస్టులకు గుడ్ బాయ్ చెప్పాడు. వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. వయసు కూడా 38 దాటిపోయింది. అయినప్పటికీ అతడిలో ఆ జోరు తగ్గడం లేదు. మైదానం మారింది. ప్రత్యర్థి మారింది. కానీ అతని బ్యాటింగ్ మాత్రం మారడం లేదు. బంతులు వేసి బౌలర్లకు అలుపు వస్తోంది. అతడికి మాత్రం ఊపు మరింత పెరుగుతోంది. అతని ఆట చూస్తే అసలు ఇక్కడికి వయసు అనేది రాదా.. ఇతడు ముసలాడు కాదా.. కొట్టి కొట్టి అలుపు అనేది ఉండదా అని ప్రత్యర్థి బౌలర్లు మనసులో అనుకుంటున్నారు.

టీమిండియాలో ఎంతమంది క్రికెటర్లు వచ్చినా.. ఈ కాలపు లెజెండ్ ఎవరు అంటే మరో మాటకు తావు లేకుండా విరాట్ కోహ్లీ పేరు అందరూ చెబుతారు. ఎంగేజింగ్ గేమ్ అంటే ఎలా ఉంటుందో అతడు టీమిండియాకు లైవ్ లో చూపించాడు. అగ్రెసివ్ ఆట అంటే ఎలా ఉంటుందో తన ఆట ద్వారా నిరూపించాడు. ఎవడు కొడితే బౌలర్లకు దిమ్మ తిరిగిపోతుంది వాడే విరాట్ కోహ్లీ అని అనేక సందర్భాల్లో అర్థమయ్యేలా చేశాడు. అతడి కెరియర్ టీమిండియాలో సంవత్సరాలుగా కొనసాగుతోంది. కొన్ని ఫార్మేట్లకు మాత్రమే అతడు దూరంగా ఉన్నాడు. తనకు ఎంతో ఇష్టమైన వైట్ బాల్ ఫార్మాట్లో మాత్రం సత్తా చూపిస్తున్నాడు.

న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తొలి వన్డేలో అతడు ఏకంగా 51 బంతుల్లో 74 పరుగులు చేశాడు. టీ మీడియా విషయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అదే రికార్డులను బద్దలు కొట్టాడు. తాజా ఇన్నింగ్స్ లో 74 పరుగులు చేయడం ద్వారా.. వన్డేలలో చేజింగ్లో అత్యధిక పరుగులు (8741) చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఆవిర్భవించాడు. ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (8720) పేరు మీద ఉండేది. సచిన్ 232 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత అందుకున్నాడు. కోహ్లీ 169 ఇన్నింగ్స్ లో మాత్రమే ఈ రికార్డు సృష్టించాడు.

చేజింగ్లో సచిన్ సగటు 42.33. విరాట్ సగటు 66.21. చేజింగ్లో విరాట్ కోహ్లీ 30 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీలు చేశాడు సచిన్ టెండూల్కర్ 17 సెంచరీలు.. 52 హాఫ్ సెంచరీలు చేశాడు.. సౌత్ ఆఫ్రికా.. ఇంగ్లాండ్.. న్యూజిలాండ్.. ఆస్ట్రేలియా జట్ల మీద వన్డే క్రికెట్లో 50+ పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా విరాట్ నిలిచాడు. సచిన్ (133) ను మించి అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో సౌత్ ఆఫ్రికా.. ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ దేశాల మీద అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (134) ఆవిర్భవించాడు.

చేజింగ్ ప్రకారంగా చూసుకుంటే..

  • విరాట్ కోహ్లీ, 8,741 పరుగులు, 169 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత అందుకున్నాడు.
  • సచిన్ టెండూల్కర్, 8720 పరుగులు 232 ఇన్నింగ్స్ లలో ఈ రికార్డు సృష్టించాడు.
  • రోహిత్ శర్మ 6,801 పరుగులు, 163 ఇన్నింగ్స్ లలో ఈ రికార్డు సృష్టించాడు.
  • సనత్ జయసూర్య(శ్రీలంక) 5,742 పరుగులు, 210 ఇన్నింగ్స్ లో ఈ రికార్డు సృష్టించాడు.
  • జాక్వెస్ కలీస్(దక్షిణాఫ్రికా), 5,575 పరుగులు, 158 ఇన్నింగ్స్ లలో ఈ రికార్డు సాధించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper