HomeతెలంగాణKalvakuntla Kavitha: రేవంత్, కేటీఆర్, బండి సంజయ్.. నేరెళ్ల పాపం.. అందరిదట.. కవిత చెప్పిన అసలు...

Kalvakuntla Kavitha: రేవంత్, కేటీఆర్, బండి సంజయ్.. నేరెళ్ల పాపం.. అందరిదట.. కవిత చెప్పిన అసలు నిజం.

Kalvakuntla Kavitha: అప్పట్లో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దారుణం జరిగింది. ఇసుక అక్రమార్కులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. దీనిని ప్రశ్నించిన దళితుల మీద దారుణానికి పాల్పడ్డారు. ఇందులో కొంతమంది చనిపోయారు కూడా. పోలీసులు కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. వాస్తవానికి నాడు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది కాబట్టి ఈ ఘటనను వెలుగులోకి రాకుండా ప్రయత్నం చేసింది. కానీ సోషల్ మీడియా బలంగా ఉండడంతో నేరెళ్ల ఘటన సభ్య […]

Kalvakuntla Kavitha: అప్పట్లో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దారుణం జరిగింది. ఇసుక అక్రమార్కులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. దీనిని ప్రశ్నించిన దళితుల మీద దారుణానికి పాల్పడ్డారు. ఇందులో కొంతమంది చనిపోయారు కూడా. పోలీసులు కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. వాస్తవానికి నాడు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది కాబట్టి ఈ ఘటనను వెలుగులోకి రాకుండా ప్రయత్నం చేసింది. కానీ సోషల్ మీడియా బలంగా ఉండడంతో నేరెళ్ల ఘటన సభ్య సమాజానికి తెలిసింది.

ఈ కేసులో సూత్రధారులను.. పాత్రధారులపై నాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. దీనికి తోడు 2023 ఎన్నికల్లో ఎన్నికల ప్రచార సమయంలో నేరెళ్ల ఘటనను పదేపదే రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఎన్నికల ప్రచారంలో దీనిని ఉపయోగించుకున్నారు. అధికారులకు వచ్చిన తర్వాత నేరెళ్ల బాధితులకు న్యాయం చేసే విధంగా చూస్తామని ప్రకటించారు. కానీ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు.

సిరిసిల్ల జిల్లా పరిధిలోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఉంటుంది. బండి సంజయ్ నాడు నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఈ గ్రామాన్ని సందర్శించింది. బాధితుల నుంచి వివరాలు సేకరించింది. కానీ ఇంతవరకు ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోలేదు. ఇకపై చర్యలు తీసుకుంటారో లేదో కూడా తెలియదు.

సరిగా ఇదే విషయాన్ని టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రస్తావించారు. నేరెళ్ల ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ నేపథ్యంలో నాడు మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్.. నేడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ ని ఏకకాలంలో ఆమె ప్రశ్నించారు. ధన దాహం కోసం నేరెళ్ల పేదల ప్రాణాలతో పెద్దలు ఆడుకున్నారని ఆమె ఆరోపించారు. ఆమె చేసిన ప్రతి ఆరోపణ కూడా నాటి నేరెళ్ల బాధితుల కన్నీటికి సాక్షంగా కనిపిస్తోంది. కవిత లేవనెత్తిన అంశాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందా.. కేటీఆర్ మీద చర్యలు తీసుకునే అంశాన్ని అవకాశం గా వాడుకుంటుందా.. బండి సంజయ్ ని ఇరుకున పెట్టే అంశాన్ని సానుకూలంగా మార్చుకుంటుందా.. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper