India vs New Zealand: న్యూజిలాండ్ గడ్డమీద భారత జట్టు పర్యటిస్తోంది. ఇప్పటికే t20.. వన్డే ట్రోఫీలను గెలుచుకుంది. గురువారం నుంచి టెస్ట్ సిరీస్ మొదలైంది. ఈ కథనం రాసే సమయం వరకు టీమిండియా బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే 78 పరుగులకు ఆతిధ్య జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ లాతం (0) ఖాతా మొదలు పెట్టకముందే బుమ్రా బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ప్రమాదకరమైన కాన్వే అన్షుల్ కాంబోజ్ బౌలింగ్లో పంత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రచిన్ రవీంద్ర (15) ఆకాష్ దీప్ బౌలింగ్ లో పంత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మిచల్ (1) ను బుమ్రా వెనక్కి పంపించాడు. బ్లెండర్ కూడా బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం నికోలస్ (43*), ఫిలిప్స్ (6*) ఆడుతున్నారు.
తొలి ఓవర్ మూడవ బంతికే బుమ్రాన్ వికెట్ తీసి భారత శిబిరంలో ఆనందాన్ని నింపాడు. ఆ తర్వాత మిగతా బౌలర్లు కూడా దుమ్మురేపడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు నిలబడలేకపోతున్నారు. మైదానం మీద తేమ ఉండడం.. బంతి స్వింగ్ అవుతున్న నేపథ్యంలో భారత బౌలర్లు దుమ్ము రేపుతున్నారు. బుమ్రా, కాంబోజ్.. ఆకాష్ దీప్ త్రయం నిప్పులు చెరిగే విధంగా బంతులు వేస్తున్నారు. తద్వారా న్యూజిలాండ్ బ్యాటర్లు క్రీజ్ లో ఉండడానికే భయపడుతున్నారు. గతంలో న్యూజిలాండ్ ఇండియాలో పర్యటించినప్పుడు టెస్టు సిరీస్ మొత్తాన్ని వైట్ వాష్ చేసింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లాలనే భారత జట్టు కలను చిదిమేసింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ఈసారి న్యూజిలాండ్ పర్యటనకు పకడ్బందీ ప్రణాళిక రంగంలోకి దిగింది.
తొలి టెస్టులో భారత జట్టు ఆడుతున్న తీరు చూస్తే 17 సంవత్సరాల రికార్డు బద్దలయ్యే విధంగా కనిపిస్తోంది. 1968లో పటౌడి.. 2009లో ధోని నాయకత్వంలో భారత జట్టు సిరీస్ సొంతం చేసుకుంది. ఇక న్యూజిలాండ్ వేదికగా భారత్ 25 టెస్టులు ఆడింది. కేవలం ఐదింట్లో మాత్రమే విజయాలు సాధించింది. పది మ్యాచ్లలో ఓడిపోయింది. మరో 10 మ్యాచ్ లు డ్రా అయ్యాయి. రెండు జట్లు ఇప్పటివరకు 65 టెస్టులలో తలపడ్డాయి. భారత్ అత్యధికంగా 22 మ్యాచ్లలో విజయం సాధించింది. 16 మ్యాచ్లలో న్యూజిలాండ్ గెలిచింది. మరో 27 మ్యాచులు డ్రా అయ్యాయి.
ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన సిరీస్లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా మొదటి స్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం రెండో స్థానంతో సరిపెట్టుకుంది. తాజాగా జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్ లో టీమిండియా కనుక విజేతగా నిలిస్తే.. అప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లడానికి అవకాశాలుంటాయి. సిరీస్ ను ఘనంగా మొదలుపెట్టిన టీమిండియా ఆ జోరు కొనసాగిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.
A PEACH FROM JASPRIT BUMRAH 🥹❤️
– Welcome back, GOAT. https://t.co/u3dL1thPDZ
— Johns. (@CricCrazyJohns) November 18, 2026