Homeక్రీడలుRohit quit: రోహిత్ వైదొలిగాడు.. కోహ్లీ నా వల్ల కాదన్నాడు.. టీమిండియా పరిస్థితేంటి?

Rohit quit: రోహిత్ వైదొలిగాడు.. కోహ్లీ నా వల్ల కాదన్నాడు.. టీమిండియా పరిస్థితేంటి?

Rohit quits: టీంఇండియా జట్టులో తాజాగా అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య నెలకొన్న కెప్టెన్సీ వివాదం ఇంకా కొనసాగుతున్నట్లే కన్పిస్తోంది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదని తెలుస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే భారత జట్టులో లుకలుకలు బయటపడుతుండటంతో క్రికెట్ ప్రియులంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

Rohit quit
Rohit quit

దక్షిణాఫ్రికాతో భారత్ జట్టు మూడు టెస్ట్, మూడు వన్డే సిరీసులను ఆడనుంది. టెస్ట్ జట్టుకు విరాట్ కోహ్లీ సారధ్యం వహించనుండగా వన్డే జట్టుకు మాత్రం అతడిని బీసీసీఐ తప్పించింది. అతడి స్థానంలో రోహిత్ శర్మను వన్డే కెప్టెన్ గా బీసీసీఐ ప్రకటించింది. తనతో మాటమాత్రం చెప్పకుండా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై విరాట్ కోహ్లీ గుర్రుగా ఉన్నారు.

దీంతోనే అతడు ఇటీవల ముంబైలో బీసీసీఐ నిర్వహించిన సమావేశానికి హాజరు కాలేదని  తెలుస్తోంది.అలాగే దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే ఆటగాళ్లంతా మూడ్రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంది. అయితే కోహ్లీ మాత్రం ఇప్పటివరకు కూడా జట్టుతో కలువలేదు. దీంతో అతడు దక్షిణాఫ్రికా పర్యటకు వస్తాడా? రాడా అన్న అనుమానాలు కలిగాయి.

ఈ పరిస్థితుల్లోనే టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ టీంకు దూరమయ్యాడు. ఆదివారం రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తొడకండరాలు పట్టేయడంతో అతడు టెస్టు సీరిస్ కు దూరమ్యాడని బీసీసీఐ ప్రకటించింది.అతడి స్థానంలో ప్రియాంక్ పాంచాల్ ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. కాగా వన్డే సీరిసుకు రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తాడని పేర్కొంది.

Also Read: ‘డేవిడ్’ కోసం భారీ స్కెచ్ వేసిన ఆర్సీబీ..!

మరోవైపు వన్డే సిరీసుకు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడని ఓ అధికారి ట్వీస్ట్ ఇవ్వడం గమనార్హం. దక్షిణాఫ్రికాలో భారత్ జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉన్న నేపథ్యంలోనే కోహ్లీ తప్పుకున్నాడనే టాక్ విన్పిస్తోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రోహిత్, కోహ్లీ మధ్య తారాస్థాయిలో విబేధాలు ఉన్నాయనే సంకేతాలు మాత్రం బయటికి బలంగా వెళుతున్నాయి.

దీంతో ఈ వివాదం ఎప్పుడు చల్లారుతుందా? అన్నక్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. బీసీసీఐ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. లేనట్లయితే ఈ పరిణామాలన్నీ భారత జట్టుకు చేటుచేసే అవకాశం ఉందని టీంఇండియా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే..!

Also Read: దక్షిణాఫ్రికా పర్యటనకు రోహిత్ శర్మ దూరమేనా?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper