Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: 'మీరు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి' అంటూ పవన్ కళ్యాణ్ పై మహేష్...

Mahesh Babu: ‘మీరు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి’ అంటూ పవన్ కళ్యాణ్ పై మహేష్ కామెంట్స్.. ట్వీట్ వైరల్..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు 51 వ పుట్టినరోజు వేడుకలు నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత గ్రాండ్ గా జరిగాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా మహేష్ బాబు అభిమానులు సేవా కార్యక్రమాలు , కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ తో పండుగ వాతావరణాన్ని తలపించారు. ఇక ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల్చిపోయిన ‘దూకుడు’ చిత్రాన్ని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో రీ రిలీజ్ చేయగా, దానికి […]

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు 51 వ పుట్టినరోజు వేడుకలు నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత గ్రాండ్ గా జరిగాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా మహేష్ బాబు అభిమానులు సేవా కార్యక్రమాలు , కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ తో పండుగ వాతావరణాన్ని తలపించారు. ఇక ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల్చిపోయిన ‘దూకుడు’ చిత్రాన్ని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో రీ రిలీజ్ చేయగా, దానికి కూడా మహేష్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇక సోషల్ మీడియా ద్వారా అయితే సినీ సెలబ్రిటీలు మహేష్ బాబు కి శుభాకాంక్షలు వెల్లువ కురిపించారు. అందులో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉండడం విశేషం. నిన్న రాత్రి తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి కృతఙ్ఞతలు చెప్తూ వచ్చాడు మహేష్ బాబు.

కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం చెప్పలేదు. పార్టీ హ్యాండిల్ నుండి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెప్పాడు కదా, అందుకే మహేష్ బాబు రిప్లై ఇవ్వలేదేమో అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే లేట్ నైట్ పవన్ కళ్యాణ్ కి కృతఙ్ఞతలు తెలుపుతూ మహేష్ బాబు వేసిన ట్వీట్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘మీ హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా నుండి మీకు అపారమైన ప్రేమ ఎల్లప్పుడూ మీకు ఉంటుంది. మీకు మరింత పవర్ చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ మహేష్ బాబు రిప్లై ఇచ్చాడు. దీనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో సంతృప్తి చెందారు. ముఖ్యంగా ‘మీకు మరింత పవర్ చేకూరాలి’ అంటూ మహేష్ బాబు చివర్లో చెప్పిన దానికి పవన్ ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

‘మరింత పవర్’ అంటే సీఎం అవ్వాలని మహేష్ కోరుకున్నట్టు వాళ్ళు అర్థం చేసుకున్నారు. మహేష్ బాబు దాదాపుగా అందరి హీరోలకు రిప్లై ఇచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన రిప్లై ఎక్కువ రీచ్ అయ్యింది. దీన్ని బట్టీ వీళ్లిద్దరికీ సోషల్ మీడియా లో మ్యూచువల్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా లో నిత్యం ఫ్యాన్ వార్స్ పేరుతో కొట్లాడుకునేది వీళ్ళే. కానీ సమయం వచ్చినప్పుడు ఇలా కలిసిపోవడాన్ని చూస్తుంటే కనుల పండుగ లాగా ఉందంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper