Homeఎంటర్టైన్మెంట్Bandla Ganesh Son Dance: బండ్ల గణేష్ కొడుకు డ్యాన్స్ చూశారా .. గ్రేస్ లో...

Bandla Ganesh Son Dance: బండ్ల గణేష్ కొడుకు డ్యాన్స్ చూశారా .. గ్రేస్ లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ లను తలపించాడు..

Bandla Ganesh Son Dance: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తన కుమార్తె జనని పెళ్లిని అత్యంత వైభవంగా ఈ నెల 16 న , ఉదయం 11 గంటల 58 నిమిషాలకు జరిపించనున్నాడు. సూర్య తేజ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి తో రీసెంట్ గానే నిశ్చితార్థం జరిపించిన బండ్ల గణేష్, పెళ్ళికి టాలీవుడ్ లో సినీ ప్రముఖులందరితో పాటు , రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించిన సంగతి తెలిసిందే . అందుకు సంబంధించిన ఫోటోలు […]

Bandla Ganesh Son Dance: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తన కుమార్తె జనని పెళ్లిని అత్యంత వైభవంగా ఈ నెల 16 న , ఉదయం 11 గంటల 58 నిమిషాలకు జరిపించనున్నాడు. సూర్య తేజ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి తో రీసెంట్ గానే నిశ్చితార్థం జరిపించిన బండ్ల గణేష్, పెళ్ళికి టాలీవుడ్ లో సినీ ప్రముఖులందరితో పాటు , రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించిన సంగతి తెలిసిందే . అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలను సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే నిన్న రాత్రి చాలా గ్రాండ్ గా ఆయన సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఆద్యంతం సరదాగా సాగిపోయిన ఈ సంగీత్ కార్యక్రమం లో , బండ్ల గణేష్ కుమారుడు హితేష్ వేసిన డ్యాన్స్ స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారాయి.

రామ్ చరణ్ , ఎన్టీఆర్ పాటలకు ఈయన వేసిన డ్యాన్స్ స్టెప్పులు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. కుర్రాడిలో చాలా టాలెంట్ ఉన్నట్టు ఉంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే పెద్ద హీరో అయిపోతాడు అంటూ సోషల్ మీడియా లో ఈ వీడియోలను చూసిన నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ లో ఉన్న గ్రేస్ , ఎన్టీఆర్ లో ఉన్న స్పీడ్ రెండు మిక్స్ చేసి ఇతను వేసిన స్టెప్పులను చూసి బండ్ల గణేష్ ఎంతగానో మురిసిపోయాడు. క్రింద చేరి ఆయన ఈలలు వేస్తూ తన కొడుకు డ్యాన్స్ ని ఎంజాయ్ చేసాడు. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. బండ్ల గణేష్ ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న హితేష్ పెద్ద కొడుకు. హిరేష్ రెండవ కొడుకు. ఇక కూతురు జనని కి సంబంధించిన పెళ్లి నే ఈ నెల 16 న జరగబోతుంది. ఈమె కూడా సంగీత్ లో డ్యాన్స్ వేయడమే కాకుండా , పాటలు కూడా పాడింది.

ఇక బండ్ల గణేష్ విషయానికి వస్తే కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించి , ఆ తర్వాత నిర్మాతగా ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్లిన ఆయన సినీ ప్రస్థానం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేయాల్సిందే. ఇప్పటి వరకు ఈయన నిర్మాతగా వ్యవహరించిన అత్యధిక సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ , గబ్బర్ సింగ్, రవితేజ తో ఆంజనేయులు, ఎన్టీఆర్ తో బాద్ షా , టెంపర్, అల్లు అర్జున్ తో ‘ఇద్దరు అమ్మాయిలతో’, రామ్ చరణ్ తో ‘గోవిందుడు అందరి వాడేలే’ వంటి చిత్రాలను తెరకెక్కించిన బండ్ల గణేష్ , ప్రస్తుతానికి సినిమాలకు దూరం గా ఉన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by NandGowli Kamlesh (@artistrybuzz_)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper