Homeక్రీడలుక్రికెట్‌Shubdeep Ghosh: టీమిండియాలోకి శుభదీప్.. ఎవరితను.. ఎందుకీ నియామకం

Shubdeep Ghosh: టీమిండియాలోకి శుభదీప్.. ఎవరితను.. ఎందుకీ నియామకం

Shubdeep Ghosh: వచ్చే వన్డే వరల్డ్ కప్ సొంతం చేసుకోవాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్ళాలి. ఇవన్నీ జరగాలంటే ఆట తీరు బాగుండాలి. ఆటగాళ్లు సమిష్టిగా ప్రదర్శన చేయాలి. అందువల్లే మేనేజ్మెంట్ ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇప్పటివరకు జట్టుకు ఇబ్బందికరంగా ఉన్న వారిని.. జట్టుతో కాంట్రాక్ట్ ముగిసిన వారిని పక్కన పెట్టింది. మీ సేవలు చాలు అంటూ నమస్కారం పెట్టింది. ఇప్పుడు ఏకంగా కొత్త రక్తాన్ని ఎక్కించే పనిలో పడింది. టీమిండియాకు మొన్నటిదాకా అసిస్టెంట్ కోచ్ […]

Shubdeep Ghosh: వచ్చే వన్డే వరల్డ్ కప్ సొంతం చేసుకోవాలి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్ళాలి. ఇవన్నీ జరగాలంటే ఆట తీరు బాగుండాలి. ఆటగాళ్లు సమిష్టిగా ప్రదర్శన చేయాలి. అందువల్లే మేనేజ్మెంట్ ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇప్పటివరకు జట్టుకు ఇబ్బందికరంగా ఉన్న వారిని.. జట్టుతో కాంట్రాక్ట్ ముగిసిన వారిని పక్కన పెట్టింది. మీ సేవలు చాలు అంటూ నమస్కారం పెట్టింది. ఇప్పుడు ఏకంగా కొత్త రక్తాన్ని ఎక్కించే పనిలో పడింది.

టీమిండియాకు మొన్నటిదాకా అసిస్టెంట్ కోచ్ గా ర్యాన్ టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఉండేవారు. వీరి కాంట్రాక్టు పూర్తయింది. అయితే వీరికి ఎటువంటి మినహాయింపు మేనేజ్మెంట్ ఇవ్వలేదు. అయితే డస్కటే మాత్రం కోల్ కతా జట్టులో జాయిన్ అవుతున్నట్టు సమాచారం.. డస్కటే చాలా సంవత్సరాలుగా కోల్కతా జట్టుతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. 2012.. 2014 సీజన్లో కోల్కతా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. 2022 నుంచి 2024 వరకు కోల్కతా జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరించాడు.. అదే సమయంలో గంభీర్ కోల్కతా జట్టుకు మెంటార్ గా ఉన్నాడు. దీంతో అతనికి భారత జాతీయ జట్టు శిక్షణ బృందంలో చోటు త్వరగానే లభించింది. టీ మీడియా టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు.. ఆసియా కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ నెగినప్పుడు డస్కటే జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.. రెండు సంవత్సరాలుగా అతడు టీమిండియాతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నప్పటికీ స్పష్టమైన బాధ్యతలను మేనేజ్మెంట్ ఇవ్వలేదు. పైగా కాంట్రాక్ట్ కూడా చేయలేదు.

దిలీప్ బాధ్యతలు ముగిసిన నేపథ్యంలో అతడి స్థానంలో శుభదీప్ గోష్ బాధ్యతలు స్వీకరిస్తాడని తెలుస్తోంది. ఇతడికి విపరీతమైన అనుభవం ఉంది. జాతీయ క్రికెట్లో అస్సాం.. రైల్వే జట్లలో కీలక ఆటగాడిగా కొనసాగాడు. ఇతడు ఆల్ రౌండర్. ఫస్ట్ క్లాస్.. లిస్ట్ ఎ వంటి వాటిలో అదరగొట్టాడు. 2004లో శుభదిప్ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఆ మరుసటి సంవత్సరం తన లిస్ట్ ఎ కెరియర్ కు శుభం పలికాడు. ఆ తర్వాత శిక్షకుడిగా బాధ్యతలు ప్రారంభించాడు. గడచిన 15 సంవత్సరాలుగా నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచింగ్ విభాగంలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. 2021 ఆస్ట్రేలియా టూర్ కు భారత మహిళలు వెళ్ళినప్పుడు.. జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా శుభదీప్ పని చేశాడు.

అండర్ 19 ప్రపంచకప్ భారత జట్టుకు అతడు ఫీల్డింగ్ కోచ్ గా పనిచేశాడు. భారత ఏ జట్టు కోచింగ్ విభాగంలో కూడా కీలకంగా వ్యవహరించాడు. ఐపీఎల్ 2014 సీజన్లో కోల్ కతా జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా పని చేశాడు. కొంతకాలంగా భారత జాతీయ జట్టు ఫీల్డింగ్ విభాగంలో నిరాశ జనకమైన ఫలితాలను చవిచూస్తున్న నేపథ్యంలో.. శుభదీప్ రాక సరికొత్త మార్పులకు నాంది పలుకుతుందని మేనేజ్మెంట్ భావిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper