Ravi Teja: హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ గా హీరో మాస్ మహారాజ రవితేజ. ‘ధమాకా’ తర్వాత రవితేజ చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. చివరికి మంచి అంచనాల నడుమ విడుదలైన ఆయన గత చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక రవితేజ మేలుకొని సరైన స్క్రిప్ట్స్ ని ఎంచుకోకపోతే , కెరీర్ ముగిసినట్టే అని అనుకుంటున్న సమయం లో , ఆయన ‘ఇరుముడి’ చిత్రం చేసాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో శివ నిర్వాణ దర్శకత్వం లో షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
మార్కెట్ లో ఈ చిత్రం పై మంచి క్రేజ్ ఉంది. కచ్చితంగా ఈ సినిమాతో రవితేజ భారీ కం బ్యాక్ ఇస్తాడని అభిమానులతో పాటు , ట్రేడ్ కూడా నమ్ముతోంది. అంతే కాకుండా ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కూడా చాలా ప్రామిసింగ్ గా ఉంది. గ్లింప్స్ వీడియో కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ రాగా, ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తో మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు రవితేజ. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. అయితే సినిమా బడ్జెట్ అంచనాలు అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యేలా ఉండడంతో మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఒప్పుకున్నా సినిమా నుండి తప్పుకున్నారు కాబట్టి , రవితేజ ని మేకర్స్ అవమానించారంటూ సోషల్ మీడియా లో ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ తప్పుకోవం తో ఆ సంస్థ నుండి బయటకు వచ్చేసిన లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించాలని చూసున్నాడట. ఈయన గతంలో దిల్ రాజు తో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల నిర్మాణాలలో భాగం పంచుకున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీ లో తన కాళ్ళ మీద తానూ నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ తో రవితేజ సినిమా అనగానే అంచనాలు భారీ రేంజ్ కి వెళ్లాయి. రవితేజ కూడా ఇతని ఫై పూర్తి నమ్మకం ఉంచాడట. మరి ఆ నమ్మకాన్ని ఎంత వరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.