Marriage Demands: వెనుకటి రోజుల్లో కన్యాశుల్కం ఉండేది. అది కాస్త కన్యదానంగా మారిపోయింది. ఇప్పుడు ఇక మళ్లీ కన్యాశుల్కం రోజులు వస్తున్నాయి. ఆధునిక కాలంలో ఇటువంటి పరిస్థితి ఏంటి అని చాలామంది తలలు పట్టుకుంటున్నప్పటికీ.. వాస్తవంలో మాత్రం అలానే ఉంది.
అమ్మాయిల సంఖ్య తగ్గిపోతుంది. అబ్బాయిలకు తగ్గట్టుగా అమ్మాయిల సంఖ్య లేదు. దీనికి తోడు అమ్మాయిలకు రిక్వైర్మెంట్లు పెరిగిపోయాయి. ఒకప్పటి మాదిరిగా అమ్మాయిలు ఇప్పుడు లేరు. పైగా వారి ఆలోచనలు భిన్నంగా ఉంటున్నాయి. ఉన్నత చదువులు చదవడం.. ఉన్నతంగా ఉండాలని కోరుకోవడం.. వాటి వల్ల అమ్మాయిలు అంత తొందరగా పెళ్లికి సిద్ధంగా లేరు. పైగా కాబోయే భర్తలలో ఉన్నతమైన లక్షణాలను కోరుకుంటున్నారు. మెరుగైన జీవితాన్ని.. భద్రతాపరమైన జీవనాన్ని.. అత్తింటి వారి తరఫున గొప్ప సంసారాన్ని అంచనా వేస్తున్నారు. దీంతో అబ్బాయిలు బిత్తర పోతున్నారు.
పెద్దలు కుదిరిచిన వివాహాలలో గతంలో అబ్బాయి మాత్రమే కండిషన్స్ పెట్టేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అమ్మాయిలు కండిషన్లు పెడుతుంటే అబ్బాయిలు తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి ఎదురు కట్నం ఇచ్చే స్థాయికి పరిస్థితి మారిపోయింది. అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడంతో ఈ డిమాండ్లు మరింత పెరుగుతున్నాయి. వధువు కుటుంబాల నుంచి వస్తున్న భారీ డిమాండ్లపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న సమయంలో ఏకంగా రెండు నుంచి మూడు కోట్ల విలువైన ఆస్తులను తమ పేరు మీద రాయాలంటూ అమ్మాయి తరఫు వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఒక వ్యక్తి కుటుంబంలో ఇటువంటి అనుభవం ఎదురయింది.
ఆ వ్యక్తి కుటుంబానికి సంబంధించిన ఒక యువకుడికి ఓ అమ్మాయితో పెళ్లి చేయాలి అనుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే సమయంలో.. ఏకంగా రెండు నుంచి మూడు కోట్ల విలువైన ఆస్తులు తమ అమ్మాయి పేరు మీద రాయాలని బంధువులు డిమాండ్ చేశారు. దీంతో ఆ యువకుడు ఒకసారి గా షాక్ కు గురయ్యాడు. తనకు ఉన్నవే ఆకాస్త ఆస్తులని.. వాటిని రాయడం కుదరదని ఆ అబ్బాయి చెప్పడంతో సంబంధం క్యాన్సిల్ అయింది. అరేంజ్డ్ మ్యారేజ్ లో కూడా ఇలాంటి డిమాండ్లు తెరపైకి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
వచ్చే రోజుల్లో ఈ పరిస్థితి ఇంకా మారుతుందని.. అమ్మాయిలు చెప్పినట్టుగానే అబ్బాయిలు వినాల్సి వస్తుందని.. పురుషాధిక్య సమాజం కాస్త.. స్త్రీ ఆధీనంలోకి మారిపోతుందని.. కుటుంబ వ్యవస్థలో కూడా అనేక రకాల మార్పులు వస్తాయని.. అప్పుడు మగవాళ్ళ పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుందని విశ్లేషకులు అంటున్నారు.