Homeజాతీయ వార్తలుIndia Bangladesh Border: చొరబాటుదారులకు చావే గతి.. బార్డర్ దాటిన స్మగ్లర్ ను లేపేసిన భారత్...

India Bangladesh Border: చొరబాటుదారులకు చావే గతి.. బార్డర్ దాటిన స్మగ్లర్ ను లేపేసిన భారత్ సైన్యం

India Bangladesh Border: బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి జరుగుతున్న అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్‌ కార్యకలాపాలపై సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) కఠిన చర్యలు కొనసాగిస్తోంది. పశ్చిమబెంగాల్‌ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రంలో అక్రమంగా ఉన్న బంగ్లాదేశీయులు పెట్టపేడ సర్దుకుని స్వదేశానికి వెళ్లిపోతున్నారు. ఇలాంటి తరుణంలో త్రిపుర రాష్ట్రంలోని అనకోటి జిల్లా సరిహద్దుల్లో ఇటీవల ఓ స్మగ్లర్‌ మన దేశంలో చొరబడేందుకు యత్నించాడు. సరిహద్దు దాటి లోపలికి.. ఆగస్టు 9, 2026 ఆదివారం తెల్లవారుజామున (సుమారు 3:30 నుంచి 4:00 […]

India Bangladesh Border: బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి జరుగుతున్న అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్‌ కార్యకలాపాలపై సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) కఠిన చర్యలు కొనసాగిస్తోంది. పశ్చిమబెంగాల్‌ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రంలో అక్రమంగా ఉన్న బంగ్లాదేశీయులు పెట్టపేడ సర్దుకుని స్వదేశానికి వెళ్లిపోతున్నారు. ఇలాంటి తరుణంలో త్రిపుర రాష్ట్రంలోని అనకోటి జిల్లా సరిహద్దుల్లో ఇటీవల ఓ స్మగ్లర్‌ మన దేశంలో చొరబడేందుకు యత్నించాడు.

సరిహద్దు దాటి లోపలికి..
ఆగస్టు 9, 2026 ఆదివారం తెల్లవారుజామున (సుమారు 3:30 నుంచి 4:00 గంటల మధ్య మగ్రూలి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది భారత భూభాగంలో, ఇరానీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉంది. బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు నుంచి అయిదుగురు స్మగ్లర్ల బృందం సరిహద్దు స్తంభం దాటి దాదాపు 500 గజాల లోపలికి ప్రవేశించింది. బీఎస్‌ఎఫ్‌ 199 బెటాలియన్‌కు చెందిన మాగురులి క్యాంప్‌ గస్తీ బృందం వారిని గుర్తించి ఆగమని హెచ్చరించింది. అయినా వారు ఆగకుండా ముందుకు వచ్చి బీఎస్‌ఎఫ్‌ సిబ్బందిపై దాడి చేసే ప్రయత్నం చేశారని భారత పోలీసు వర్గాలు తెలిపాయి. ఆత్మరక్షణలో బీఎస్‌ఎఫ్‌ రెండు రౌండ్లు కాల్పులు జరిపింది. దీంతో ఒకరు మరణించగా, మిగిలినవారు బంగ్లాదేశ్‌ వైపు పారిపోయారు.

స్మగ్లర్‌ మహ్మద్‌ తారా మియా హతం..
మరణించిన వ్యక్తి పేరు మహమ్మద్‌ తారా మియా. వయసు 20 సంవత్సరాలు. ఆయన బంగ్లాదేశ్‌లోని మౌలవిబజార్‌ జిల్లా, కులౌరా ఉపజిల్లా, మురాయిఛరా బస్తీ గ్రామానికి చెందినవాడు. తండ్రి పేరు అబ్దుల్‌ మాలెక్‌. ఆయనపై గతంలోనే స్మగ్లింగ్‌ కేసు నమోదై ఉంది. కులౌరా పోలీస్‌ స్టేషన్‌లో ఫైల్‌ అయిన ఈ కేసు వివరాలను బంగ్లాదేశ్‌ బోర్డర్‌ గార్డు కూడా ధృవీకరించింది. కొన్ని నివేదికల ప్రకారం బర్మీస్‌ సిగరెట్లు వంటి నిషేధిత వస్తువుల రవాణాలో ఆయన పాల్గొనేవాడని సమాచారం.

బంగ్లాదేశ్‌ స్పందన..
బీజీబీ 46 బెటాలియన్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ సర్కర్‌ ఆసిఫ్‌ మహమూద్‌ ఈ సంఘటనను ధృవీకరించారు. తారా మియా స్మగ్లింగ్‌లో పాల్గొంటున్నట్లు వారు అంగీకరించారు. అయినా బీఎస్‌ఎఫ్‌ కాల్పులను నిరసిస్తూ అధికారికంగా సంప్రదించారు. శవాన్ని పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత బీజీబీ ద్వారా కుటుంబానికి అప్పగించనున్నారు. శవం ప్రస్తుతం కైలాషహర్‌ ఆసుపత్రికి తరలించబడింది.

గతంలోనూ చొరబాటు యత్నాలు..
ఇదే ప్రాంతంలో 2026 జూన్‌లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. అప్పుడు మరో బంగ్లాదేశీ యువకుడు ముజీబ్‌ అలీ బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో మరణించాడు. త్రిపుర–బంగ్లాదేశ్‌ సరిహద్దు 856 కిలోమీటర్ల పొడవున ఉండగా, కొన్ని ప్రాంతాల్లో ఇంకా కంచె ఏర్పాటు పూర్తికాలేదు. దీని వల్ల స్మగ్లింగ్‌ ప్రయత్నాలు తరచుగా జరుగుతున్నాయి.

ఈ సంఘటన సరిహద్దు భద్రతా సవాళ్లను మరోసారి ఎత్తిచూపుతోంది. స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌లు రెండు దేశాల యువకులను లాగుతున్నాయి. బీఎస్‌ఎఫ్‌ ఆత్మరక్షణలో కాల్పులు జరిపినట్లు భారత వైపు స్పష్టం చేస్తుండగా, బంగ్లాదేశ్‌ వైపు నిరసనలు వ్యక్తం చేస్తోంది. దీర్ఘకాలిక పరిష్కారం కోసం రెండు దేశాల సరిహద్దు దళాల మధ్య సమన్వయం పెంచడం, స్మగ్లింగ్‌కు దారితీసే ఆర్థిక కారణాలను పరిష్కరించడం, అంతర్జాతీయ సరిహద్దుల్లో ఆధునిక నిఘా వ్యవస్థలు మరింత బలోపేతం చేయడం అవసరం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper