HomeNewsGautam Gambhir : గౌతమ్ గంభీర్ ఆ పని చేశాడు.. ఇది ప్రపంచంలో ఎనిమిదవ వింత..

Gautam Gambhir : గౌతమ్ గంభీర్ ఆ పని చేశాడు.. ఇది ప్రపంచంలో ఎనిమిదవ వింత..

Gautam Gambhir : ప్రపంచంలో ఏడు వింతలున్నాయి. ఆ విషయం మనకు తెలుసు. కానీ ఇది ఎనిమిదో వింత.. ఇది గిన్నిస్ బుక్ రికార్డుకు ఎక్కని ఘనత.. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చాల్సిన చరిత్ర.. నిజమే.. ఇంతకీ ఏం జరిగింది.. ఏమైంది.. గౌతమ్ గంభీర్.. టీమిండియా హెడ్ కోచ్.. ముక్కు మీద కోపాన్ని చూపించే మనిషి. ఎటువంటి హావభావాన్ని ప్రదర్శించలేడు. రోబో లాగా కనిపిస్తాడు. ఎవరితోనూ పెద్దగా సరదాగా ఉండడు. ప్రతి కోణంలోనూ సీరియస్ నెస్ […]

Gautam Gambhir : ప్రపంచంలో ఏడు వింతలున్నాయి. ఆ విషయం మనకు తెలుసు. కానీ ఇది ఎనిమిదో వింత.. ఇది గిన్నిస్ బుక్ రికార్డుకు ఎక్కని ఘనత.. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చాల్సిన చరిత్ర.. నిజమే.. ఇంతకీ ఏం జరిగింది.. ఏమైంది..

గౌతమ్ గంభీర్.. టీమిండియా హెడ్ కోచ్.. ముక్కు మీద కోపాన్ని చూపించే మనిషి. ఎటువంటి హావభావాన్ని ప్రదర్శించలేడు. రోబో లాగా కనిపిస్తాడు. ఎవరితోనూ పెద్దగా సరదాగా ఉండడు. ప్రతి కోణంలోనూ సీరియస్ నెస్ కనిపిస్తూ ఉంటుంది. అందువల్లే మనోడిని మిస్టర్ యాంగ్రీ మ్యాన్ అని పిలవడం మొదలుపెట్టారు. అతని కోపం.. అతని ఆవేశం.. అతని ఆగ్రహం.. అనేక సందర్భాలలో కనిపించింది. ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది.

భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ అయినప్పటికీ కూడా గౌతమ్ గంభీర్ తన వ్యవహార శైలిని మార్చుకోలేదు. మార్చుకుంటే అతడు గౌతమ్ గంభీర్ ఎందుకు అవుతాడు. కోపాన్ని.. చూపిస్తూనే ఉన్నాడు. తనకు తగ్గట్టుగా ప్రణాళికలను అమలు చేస్తూనే ఉన్నాడు. కాకపోతే అవి ఎదురు తంతున్నాయి. అందువల్లే అతని మీద సోషల్ మీడియాలో.. ప్రధాన మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అసలు ఇతడు ఎప్పుడు మారతాడు.. ఎప్పుడు జనాలలో కలుస్తాడు పని సోషల్ మీడియాలో టీమిండియా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇంతవరకు గౌతమ్ గంభీర్ తన శైలి మార్చుకున్న ప్రయత్నం చేయలేదు.

ప్రస్తుతం టీం ఇండియా శ్రీలంకలో ఉంది. శ్రీలంక జట్టుతో త్వరలో రెండు టెస్టులు ఆడబోతోంది. ఆగస్టు 15న తొలి టెస్ట్ మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో శ్రీలంక బీ జట్టుతో టీమ్ ఇండియా ఆడుతోంది. బౌలింగ్ పేలవంగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ మాత్రం అదరగొడుతుంది. శ్రీలంక బి జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీ వద్ద టీమ్ ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజా అచ్చం కులదీప్ యాదవ్ లాగా బౌలింగ్ చేశాడు. ఏమాత్రం వంకపెట్టే అవకాశం లేకుండా బౌలింగ్ మొత్తం దించేశాడు. అయితే అతడు బౌలింగ్ వేసిన తర్వాత.. ఈ యాక్షన్ మొత్తం గాల్లో ఈత కొట్టినట్టుగా ఉందని గౌతమ్ గంభీర్తో చెప్పాడు. దీంతో గంభీర్ నవ్వును ఆపుకోలేకపోయాడు. గట్టిగా పగలబడి నవ్వాడు. గంభీర్ నవ్విన తీరుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. దీంతో చాలామంది ఇది ప్రపంచంలో ఎనిమిదవ వింత అని.. గౌతమ్ గంభీర్ కూడా నవ్వుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper