South Indian Film Industry: తెలుగు వారికి సినిమా అంటే పిచ్చి.. ఇది ఇప్పటి మాట కాదు, ఎస్వీయార్ ఎన్టీఆర్ కాలం నుంచి వినిపిస్తున్న మాట. మరి ఈ మాటలో వాస్తవం ఉందా ? అసలు తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎక్కువగా చూడటానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే చాలా కారణాలు ఉన్నాయి. తెలుగు ప్రజలు వినోదాన్ని ఎక్కువగా కోరుకుంటారు. నిజానికి వినోదం అనేది అందరికీ అవసరమే.

వినోదం కారణంగానే కొంచెం శ్రమించిన శరీరం తేలికపడి ఆహ్లాదాన్ని అనుభవిస్తుంది. ఆ పైన కొత్త పనులు చేయడానికి తోడ్పడుతుంది. సంపద ఎక్కువగా ఉన్న సమాజాలలో తీరిక గూడా తగినంత ఉన్న సమాజాలలో వినోదం పాళ్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే బహుశా తెలుగు రాష్ట్రాల్లో కూడా వినోదం ఎక్కువై ఉంటుంది. ఇక్కడ అర్ధం చేసుకోవాల్సింది సంపద మనకు ఎక్కువ ఉంది అని కాదు, మన వాళ్లకు తీరిక సమయం కూడా ఎక్కువ ఉంది అనుకోవచ్చు.
అందుకే, సినిమా మొదలైన తొలి రోజుల నుంచీ మన దేశంలో ఉన్న సినిమా హాళ్ళలో సగం పైన దక్షిణాది నాలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అంటే, 20% జనాభా ఉన్న దక్షిణాన 60% సినిమా హాళ్ళు ఉన్నాయి. మహా గొప్ప అనుకునే మహారాష్ట్రలో సినిమా హాళ్ళు 700 దాకా ఉండొచ్చు. మరి హిందీ సినిమాలు ఎవరు చూస్తున్నారు అంటే.. దక్షిణాదివారే.
Also Read: వేరే లెవెల్లో ప్రభాస్ యాక్టింగ్.. ‘రాధేశ్యామ్’కు తిరుగులేదంటున్న దర్శకుడు
అలా కనుక కాకుంటే హిందీ చిత్ర పరిశ్రమ ఎప్పుడో చతికలపడేది. అంటే ఒక విధంగా భారతీయ సినిమా పరిశ్రమను నడుపుతున్నది దక్షిణాది వారే. బాలీవుడ్ పరిశ్రమ సంవత్సర ఆదాయ విలువ భారతీయ చిత్ర పరిశ్రమలో 40%మాత్రమే. మొత్తం మన చిత్ర పరిశ్రమ ఆదాయం విలువ ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు. ఈ లెక్క సౌత్ సినిమా ఇండస్ట్రీ లేకపోతే ఇండియన్ సినిమా లేనట్లే.
ఇక సౌత్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లేకపోతే.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ బలంగా లేనట్లే. కాబట్టి.. తెలుగు సినిమాలు భారతీయ సినిమాల్లోనే చాలా కీలకమైనవి. కారణం ఒక్కటే.. తెలుగు ప్రేక్షకులు సినిమా లవర్స్. వాళ్లకు సినిమా కావాలి.
Also Read: రోమాలు నిక్కపొడుచుకునేలా ‘ది వాయిస్ ఆప్ రవన్న’.. ‘విరాట పర్వం’ తాజా అప్డేట్