India vs Sri Lanka : ప్రపంచ శ్రేణి బౌలర్లు.. చూస్తుండగానే వికెట్లు పడగొట్టగలిగే సామర్థ్యం.. పైగా ప్రత్యర్థి జట్టు మీద తిరుగులేని ఆధిపత్యం.. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ టీమ్ ఇండియాకు లంకను పడగొట్టడం ఎలాగో తెలియడం లేదు. టెస్ట్ సిరీస్ ప్రారంభం కాకముందే టీమిండియాలో ఉన్న లోపాలు బయటపడ్డాయి.
బయటపడిన ఈ లోపాలను సవరించుకుంటే సిరీస్ సొంతమవుతుంది. లేకపోతే మరో ఓటమి ఖాతాలో చేరుతుంది. శ్రీలంక బీ జట్టుతో వార్మ ప్ మ్యాచ్ లో భారత బౌలర్లు ఏమాత్రం సత్తా చూపించలేకపోయారు. గురువారం తొలిరోజు ఆట ముగిసిన సమయానికి శ్రీలంక జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 363 రన్స్ చేసింది. శ్రీలంక జట్టులో కేసర నువాంత(9*), దిలుం సుధీర (1*) క్రీజ్ లో ఉన్నారు. మధుష్క 66, రసంత 71, దినుష 51 పరుగులు చేసి అదరగొట్టారు. పవన్ రత్న నాయకే 39, విక్రమసింగే 31, సూర్య బండార 35 వంటివారు ఇండియన్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు.
మన బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. కులదీప్ యాదవ్ రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. సుతార్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. బ్రార్ ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. పాస్ ఓడిన శ్రీలంక జట్టుకు ఓపెనర్లు నిషాన్.. రవిందు తొలి వికెట్ కు ఏకంగా 110 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో సిరాజ్.. ప్రసిద్ ఒక వికెట్ కూడా దక్కించుకోలేదు వీరిద్దరూ 21 ఓవర్లు వేసి, 76 పరుగులు సమర్పించుకున్నారు. బుమ్రా లేకుండానే టీమ్ ఇండియా ఈ సిరీస్ ఆడబోతోంది. ఈ క్రమంలో ఈ ఇద్దరు బౌలర్లు ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇక కొత్త బౌలర్ సారాంష్ జైన్ 11 ఓవర్ల పాటు బౌలింగ్ వేసి, 54 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
ఇక తొలిరోజు ఆటకు టీమిండియా కెప్టెన్ గిల్ దూరంగా ఉన్నాడు. ప్రాక్టీస్ చేస్తుండగా అతడికి గాయమైంది. దీంతో జట్టుకు అతడు కాకుండా కేఎల్ రాహుల్ నాయకత్వం వహించాడు. ఒకవేళ శనివారం గిల్ గాయం గనుక తగ్గిపోతే.. అతడు జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఒకవేళ అది కూడా సాధ్యం కాకపోతే ఆగస్టు 15న శ్రీలంక జట్టుతో జరిగే తొలి టెస్ట్ లో మాత్రమే అతడు ఆడతాడు.