Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 10 : 'బిగ్ బాస్ 10 ' లోకి కంటెస్టెంట్ గా...

Bigg Boss Telugu 10 : ‘బిగ్ బాస్ 10 ‘ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టనున్న ప్రభాస్ బాబాయ్.. ఇది మామూలు సర్ప్రైజ్ కాదు..

Bigg Boss Telugu 10 : వచ్చే నెల 6 వ తేదీన స్టార్ మా ఛానల్ లో ప్రారంభం కానున్న ‘బిగ్ బాస్ 10’ గురించి సోషల్ మీడియా లో అప్పుడే బజ్ మొదలైంది. గత సీజన్ చాలా పెద్ద హిట్ అవ్వడం తో , ఈ సీజన్ పై ప్రేక్షకులు అంచనాలు కనీవినీ ఎరుగని రేంజ్ లో పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా , చాలా బలమైన టాప్ సెలబ్రిటీలను […]

Bigg Boss Telugu 10 : వచ్చే నెల 6 వ తేదీన స్టార్ మా ఛానల్ లో ప్రారంభం కానున్న ‘బిగ్ బాస్ 10’ గురించి సోషల్ మీడియా లో అప్పుడే బజ్ మొదలైంది. గత సీజన్ చాలా పెద్ద హిట్ అవ్వడం తో , ఈ సీజన్ పై ప్రేక్షకులు అంచనాలు కనీవినీ ఎరుగని రేంజ్ లో పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా , చాలా బలమైన టాప్ సెలబ్రిటీలను ఈ షో కి తీసుకొని రాబోతున్నారు. ఇప్పటికే ‘జబర్దస్త్’ పాపులర్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ ఈ షో లో కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన పంచులతో ప్రేక్షకులకు పొట్ట చెక్కలు అయ్యేలా చేసే ఇలాంటి తోపు కమెడియన్ ని తీసుకున్నప్పుడే బిగ్ బాస్ టీం సగం సక్సెస్ అయ్యింది.

ఇప్పుడు మరో కంటెస్టెంట్ ని కూడా ఖరారు చేసిందట బిగ్ బాస్ టీం. అతను మరెవరో కాదు , రెబల్ స్టార్ ప్రభాస్ కి బాబాయ్. నిజమైన బాబాయ్ కాదండోయ్.. ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ కి బాబాయ్ గా నటించిన ఆదిత్య మీనన్ అన్నమాట. పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్స్ అందరితో కలిసి నటించిన ఈయన , బిగ్ బాస్ షో లో పాల్గొనేందుకు ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయం అక్కర్లేని ముఖం ఇది. పేరు అందరికీ పెద్దగా రిజిస్టర్ అయ్యి ఉండకపోవచ్చు కానీ , ఈయన ముఖాన్ని చూస్తే చిన్న పిల్లవాడు కూడా గుర్తుపట్టగలరు. పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , రామ్ చరణ్, ప్రభాస్ , అల్లు అర్జున్ , ఎన్టీఆర్ ఇలా అందరి సూపర్ స్టార్స్ తో కలిసి నటించిన హిస్టరీ ఈయనది.

ఇప్పటికీ ఈయన యాక్టీవ్ గా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. గత ఏడాది ఈయన నుండి ఏకంగా 6 సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. అంతకు ముందు తో పోలిస్తే సినిమాల పరంగా ఈమధ్య కాలం లో ఆదిత్య మీనన్ కాస్త తగ్గిందనే చెప్పాలి. అందుకే ఈయన బిగ్ బాస్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి , జనాలకు మరింత దగ్గరవ్వాలని చూస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ షోస్ లోకి అడుగుపెట్టిన పేరు మోసిన విలన్స్, నిజ జీవితం లో క్యారెక్టర్ పరంగా గోల్డ్ అనిపించుకున్నారు. ఈయన కూడా అదే పేరుతో బయటకి వెళ్తాడా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper