Homeఆధ్యాత్మికంToday 5 November 2025 Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు ధన పండుగ.. పట్టిందల్లా...

Today 5 November 2025 Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు ధన పండుగ.. పట్టిందల్లా బంగారమే..

Today 5 November 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి కార్తీక పౌర్ణమి అనుకూలమైన వాతావరణం ఇవ్వనంది. మరికొన్ని రాసిన వారు ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈరోజు ఉద్యోగులకు ఈరోజు అదరపు బాధ్యతలు ఏర్పడతాయి. తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు ఉండడంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. దీంతో మన షాదీ లోపిస్తుంది. జీవిత భాగస్వామికి తెలియకుండా ఇవాళ ఎవరికీ డబ్బు ఇవ్వకుండా ఉండాలి. ఎందుకంటే ఏవి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సమస్యలను ఎదుర్కొంటుంది.. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దూరపు బంధువుల నుంచి ధన సహాయమందుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండనుంది. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈరోజు వారు అనేక రంగాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మిగిలిన ఫలితాలు సాధిస్తారు. అ నైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారం అనుకోకుండా నష్టం చదువు చూడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఇతరులకు జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వ్యవహారం జరిపేటప్పుడు కొత్త వ్యక్తులను కలవకుండా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు..

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈరోజు వ్యాపారులకు ఈరోజు గణనీయమైన లాభాలు ఉండనున్నాయి. ఉద్యోగులకు పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. అనుకోకుండా దూర ప్రయాణం చేస్తారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. ఇంటి నిర్మాణం కోసం అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కొత్తవారికి డబ్బు ఇవ్వడానికి నిరాకరించండి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు విదేశాల నుంచి శుభవార్తలు విని అవకాశం ఉంటుంది. వ్యాపారులకు వందనపు లాభాలు ఉంటాయి. ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేయడంతో మనశాంతితో ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విహార యాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులకు శత్రువుల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. విద్యార్థుల్లో పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆర్థిక సంబంధించిన వివాదాలు ఉంటే తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల వాతావరణ ఉండడంతో కొన్ని ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తారు. వీరికి తోటి వారి మద్దతు ఉంటుంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. అనుకున్న దానికంటే ఎక్కువగా లాభపడతారు. తోటి వారి మద్దతు ఉండడంతో కొందరు ఉద్యోగులకు అదనపు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. పదోన్నతిని కూడా పొందుతారు. విద్యార్థులు పోటి పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. గతంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే కొత్తవారితో ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అనవసరంగా డబ్బులు ఇవ్వకుండా ఉండాలి. కొత్త అప్పులు చేయొద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరైనా సహాయం అడిగితే చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. చట్టపరమైన చిక్కులు ఉంటే నేటితో తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్న విభేదాలు తొలగిపోవడంతో మనశ్శాంతి ఉంటుంది. స్నేహితులకు డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండాలి. ఎందుకంటే ఇవి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితో వాదనలకు దిగకుండా ఉండాలి. వ్యాపారాలు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారి జీవిత భాగస్వామి కోసం ఈరోజు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి ధన సహాయమందుతుంది. ఉద్యోగులకు అదనపు లాభాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులను చేపడితే వెంటనే పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరితో ఎక్కువగా వాదనలకు దిగకుండా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అచ్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే పెద్దలను సంప్రదించాలి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో వ్యాపారులు లాభాలు పొందుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper