Horoscope|27-11-2026 : శుక్రవారం (నవంబర్ 27) రోజున గ్రహాల సంచారం, జ్యోతిష్య అంచనాల ప్రకారం ద్వాదశ రాశుల వారికి భిన్నమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కొందరికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడితే.. మరికొందరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. మరి ఈరోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం.
మేషం: ఈరోజు చేపట్టిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వృషభం: కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కొత్త పరిచయాల వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.
మిధునం: ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది.
కర్కాటకం: అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టాలి. కుటుంబ విషయాలలో సహనం అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహం: ఉద్యోగ, వ్యాపార రంగాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కన్య: పెండింగ్ పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు లాభాలను ఇస్తాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.
తుల: ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులను మొదలు పెట్టడానికి అనుకూలమైన సమయం ఏర్పడుతుంది. బంధువులతో సంతోషంగా ఉంటారు.
వృశ్చికం: తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు: అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు పాలిస్తాయి. శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది.
మకరం: చేపట్టే పనుల్లో ఒత్తిడి ఉంటుంది. ఆయనప్పటికీ పట్టుదలతో ముందుకు వెళ్తారు. కుటుంబ సభ్యులు అండగా నిలుస్తారు:
కుంభం: కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. స్నేహితులతో ఆనందంగా సాగిపోతూ ఉంటారు.
మీనం: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో త్వరలో శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
అయితే ఈ వివరాలు మొత్తం సాధారణ జ్యోతిష్య అంచనాల మాత్రమే. వ్యక్తుల జాతకాల ఆధారంగా.. గ్రహ స్థితుల ఆధారంగా ఈ ఫలితాలు మారే అవకాశం ఉంది.