Homeఆధ్యాత్మికంToday 31 August 2026 Horoscope: ఈ ఐదు రాశులపై ఈరోజు మహాశివుని ఆశీస్సులు.....

Today 31 August 2026 Horoscope: ఈ ఐదు రాశులపై ఈరోజు మహాశివుని ఆశీస్సులు.. ఉద్యోగులకు పండుగ వాతావరణం..

Today 31 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మరి కొన్ని రాశుల వారు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు కార్యాలయంలో వేగంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. దీంతో […]

Today 31 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మరి కొన్ని రాశుల వారు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు కార్యాలయంలో వేగంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. దీంతో ఉద్యోగులు అధికారం నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ వాతావరణం సంతోషంగా గడుస్తుంది. అప్పుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడడంతో వ్యాపారులు ఊహించని లాభాలు పొందుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత బకాయిలు వసూలు అవుతాయి. తీరని కోరికలు నెరవేరుతాయి. వ్యాపారులు కొత్తగా ఒప్పందాలు చేసుకునే ముందు పెద్దలను సంప్రదించాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామిగా సంతోషంగా ఉంటారు. పెద్దల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి ఉద్యోగుల పనితీరును ఈరోజు అధికారులు ప్రశంసిస్తారు. వ్యాపారులకు లాభాలు వచ్చే కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. అయితే ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి కుటుంబ సభ్యుల మధ్య ఈరోజు భావోద్వేగాలు ఏర్పడతాయి. కొత్తగా అప్పులు చేసే ముందు కాస్త ఆలోచించడం బెటర్. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ధ్యానం చేయడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. కార్యాలయాల్లో ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడుస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత అలవార పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. అవసరమైన మేరకు విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : మీ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ బంధం మరింత బలపడుతుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు ఆటంకాలు లేకుండా సాగుతుంది. కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. మార్కెటింగ్ రంగంలో ఉండే వారికి కలిసి వస్తుంది. నైపుణ్య ప్రదర్శించడం ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబ సభ్యుల మద్దతుతో కొత్తగా పెట్టుబడులు పెడతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా అదృష్టం గరిస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులు శరవేగంగా పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మార్కెట్లో పురోగతి లభిస్తుంది. నూతన ప్రాజెక్టును చేపడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో వీటినే వెంటనే పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు క్రమశిక్షణతో ఉండగలుగుతారు. కార్యాలయాల్లో అధికారుల మద్దతు ఉండడంతో ఉద్యోగులకు ప్రశంశాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. అవసరమైన మేరకు విశ్రాంతి తీసుకోవాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు మనసులో నుంచి ప్రతికూల ఆలోచనలు తీసివేయాలి. కుటుంబం కోసం కష్టాలు పడతారు. అయినా సరైన ఫలితాలు ఉంటాయి. గతంలో ఉన్న విభేదాల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పరిచయాలతో వ్యాపారులకు కొత్త లాభాలు ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు సృజనాత్మకతతో ముందుకు వెళ్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper