Today 4 September 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు శ్రీకృష్ణుడి అండదండలు ఉంటాయి. దీంతో కొత్త ఆలోచనలతో ఉత్సాహంగా ఉంటారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారి కి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఖర్చులు తగ్గుతాయి. ప్రశాంతమైన జీవితం సాగుతుంది. వీరి మాట తీరుతా ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కొత్త వస్తువుల కొనుగోలుకు ఇదే మంచి సమయం. ఉద్యోగులకు అనుకోకుండా ఆదాయం వస్తుంది. వ్యాపారులకు భాగస్వాములు సహాయంతో కొత్త ఆదాయాన్ని పొందుతారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వృషభ రాశి వారికి ఈరోజు అన్ని కలిసి వస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆలోచనలతో కుటుంబ సభ్యులు ఏకీభవిస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. గతంలో కంటే ఎప్పుడూ మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు అనవసరపు ఆలోచనలకు దూరంగా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆందోళనలు తగ్గుతాయి కానీ ఖర్చులు పెరిగే అవకాశాలుంటాయి. అందువల్ల ఏదైనా వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు విని అవకాశం ఉంటుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ఆశయాలను నెరవేర్చుకుంటారు. వీరికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారులకు ఆదాయం లభిస్తుంది. ఉద్యోగులకు కలిసి వస్తుంది. శ్రీకృష్ణుడిని ఆరాధిస్తే అన్నీ కలిసి వస్తాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు కెరీర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోకుండా కొన్ని విజయాలు సిద్ధిస్తాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టడానికి ఇదే మంచి సమయం. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు ఉన్నటువంటి ఆదాయం పెరుగుతుంది. పని మీద ఏకాగ్రత పెట్టాలి. అనవసరపు ఆలోచనలకు దూరంగా ఉండడమే మంచిది.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అన్ని కలిసి వస్తాయి విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు శుభవార్తలు వింటారు. అదృష్టం తోడు కావడంతో అన్ని పనులు పూర్తవుతాయి. కొత్తగా ఏదైనా పనిని మొదలు పెట్టాలనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపారులకు కొత్త ఆదాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు తీసుకుని నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఊహించని ధన లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. వృశ్చిక రాశి వారికి ఈ రోజు వ్యాపారం కలిసి వస్తుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల అండదండలు ఉండడంతో వ్యాపారులకు లాభాలు ఉంటాయి. అయితే ఖర్చులు జాగ్రత్తగా ఉంచాలి. విదేశాల నుంచి శుభవార్తల వినే అవకాశం ఉంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం కుదుటపడుతుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. నక్షత్రాల ప్రభావం వల్ల అన్ని కలిసి వస్తాయి. చట్టపరమైన చిక్కులు దూరమవుతాయి. దూరమైన కుటుంబ సభ్యులు దగ్గరవుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కళా రంగంలో ఉంటే వారికి అన్ని కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులకు కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఏదైనా నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కచ్చితంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఆన్లైన్లో పెట్టుబదుల కు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని చూస్తారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మనసులో చెడు ఆలోచనలను దూరం చేయాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి. కొన్ని ముఖ్యమైన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్స్లో రాణిస్తారు. తోటి వారి సహాయంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొన్ని విషయాల్లో ధైర్య సాహసాలు పాటిస్తారు దీంతో వ్యాపారంలో రాణిస్తారు.