Homeఆధ్యాత్మికంToday 2 September 2026 Horoscope: ఈ ఐదు రాశుల నిరుద్యోగులకు ఈరోజు గుడ్...

Today 2 September 2026 Horoscope: ఈ ఐదు రాశుల నిరుద్యోగులకు ఈరోజు గుడ్ న్యూస్..

Today 2 September 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా శుభ ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేషరాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొత్తగా […]

Today 2 September 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా శుభ ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇదే మంచి. వ్యాపారులకు అన్ని కలిసి వస్తాయి. దీంతో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండటంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా పదోన్నతులు పొందే అవకాశాలుంటాయి. కళా రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్తగా పనిని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇంటికి నిర్మాణానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి భారీగా లాభాలు ఉంటాయి. ఆస్తుల విక్రయాలు ద్వారా అధిక లాభాలు పొందుతారు. ప్రశాంతమైన వాతావరణాన్ని పొందుతారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు కలిసి వస్తుంది. ఉద్యోగులు అనుకున్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సాంకేతిక రంగాల్లో పనిచేసే వారికి అదనంగా ఆదాయం లభిస్తుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. అయితే పక్కన ఉండే వ్యక్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. వ్యాపారులకు సమాజంలో గౌరవం లభిస్తుంది. కానీ ఇదే సమయంలో ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్నీ కలిసి వస్తాయి. అనుకోకుండా ఆదాయం లభిస్తుంది. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త ప్రాజెక్టులను చేపడతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు డబ్బు అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. శత్రువులపై వ్యాపారులు కన్నేసి ఉంచాలి. వ్యాపార రహస్యాలను ఇతరులకు చెప్పకుండా ఉండాలి. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండటమే మంచిది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విధాలా కలిసి వస్తుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని మార్పులతో అధిక లాభాలు ఉంటాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు చక్కబడుతాయి. ఉద్యోగులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యుల నుంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీంతో వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్య విషయంలో సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆకస్మిక ధన లాభంతో సంతృప్తిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఇంట్లోని రహస్యాలను ఇతరులకు చెప్పకుండా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper