Accidents In Telugu States: ప్రమాదం అనేది చెప్పి రాదు. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడడం తప్ప మరో మార్గం లేదు.. ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే బయటికి వెళ్లకుండా ఉండాలి. అత్యవసరమైతే బయటకు వెళ్లినప్పటికీ.. సాధ్యమైనంతవరకు స్వీయ రక్షణ ను పాటించాలి. ఎందుకంటే ప్రాణం అనేది చాలా విలువైనది.. ఆ విలువైన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే మన జాగ్రత్తలలో మనం ఉండాలి.
వెనుకటి కాలంలో ఈ స్థాయి లో వాహనాలు లేవు. రోడ్లు కూడా ఇంత అద్వానంగా లేవు. పైగా అందరు కూడా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేవారు. మద్యం తాగే వారి సంఖ్య కూడా తక్కువగా ఉండేది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు అంతగా చోటు చేసుకునేవి కావు. కానీ ఇప్పుడు రోడ్ల సంఖ్య పెరిగినప్పటికీ.. అవి నిర్మించే క్రమంలో నాణ్యత అనేది నేతి బీరగా మారుతుంది. చిన్న చిన్న వర్షాలకి రోడ్లు గుంతల మయంగా మారిపోతున్నాయి. దీనికి తోడు వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. మద్యం తాగి వాహనాలు నడిపేవారు ఎక్కువైపోయారు. డ్రైవింగ్లో అనుభవం లేకుండానే చాలామంది వాహనాలు నడుపుతున్నారు.. ఆ వాహనాల మీద అదుపు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గడచిన 15 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల వల్ల దాదాపు 40 మంది దాకా చనిపోయారు. అంతకుమించిన స్థాయిలో గాయపడ్డారు.
ఈ ప్రమాదాలు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల చోటుచేసుకున్నాయి. వాస్తవానికి ఈ ప్రమాదాలను ఓ స్వామీజీ ముందుగానే ఊహించి చెప్పారు. ఆగస్టు, నవంబరు, డిసెంబర్ నెలలో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా ప్రమాదాల జరుగుతాయని.. దేశవ్యాప్తంగా కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటాయని ఆయన హెచ్చరించారు.. కొన్ని నెలల ముందుగానే ఆయన ఈ హెచ్చరికలు చేశారు.. ఈ ప్రమాదాల వల్ల చాలామంది చనిపోతారని ఆయన ముందుగానే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఆయన చెప్పిన మాసాలలోనే ఈ ప్రమాదాలు జరగడం గమనార్హం.
ఈ ప్రమాదాల సమయంలో జాగ్రత్తలు పాటించాలని.. ప్రభుత్వాలు ప్రజలను జాగృతం చేయాలని ఆయన సూచించారు.. ఆయన ఏ ముహూర్తాన ఆ మాటలు అన్నారో తెలియదు గాని.. అవన్నీ కూడా నిజమవుతున్నాయి. వాస్తవానికి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బాధపడే దానికంటే.. జాగ్రత్తగా ఉండడమే ఉత్తమం. లేనిపక్షంలో ఆ ప్రమాదాల బారిన పడాల్సి ఉంటుంది. అందువల్లే స్వీయ రక్షణ అనేది అత్యంత ముఖ్యం.
View this post on Instagram