Homeఆధ్యాత్మికంToday 30 December 2025 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ధన పండుగ..

Today 30 December 2025 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ధన పండుగ..

Today 30 December 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశరాసులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు శ్రీమహావిష్ణువు ఆశీస్సులు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : . ఈ రాశి వారు ఈరోజు ఏ పని మొదలుపెట్టిన దానిని విజయవంతంగా పూర్తి […]

Today 30 December 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశరాసులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు శ్రీమహావిష్ణువు ఆశీస్సులు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : . ఈ రాశి వారు ఈరోజు ఏ పని మొదలుపెట్టిన దానిని విజయవంతంగా పూర్తి చేయగలుగు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఎవరికి డబ్బు ఇవ్వకపోవడమే మంచిది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. దీంతో వారి వ్యాపార అభివృద్ధి పెరిగే అవకాశం ఉంది. ప్రియమైన వారికోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపేందుకు దేవాలయాలను సందర్శిస్తారు. ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు కలగనున్నాయి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆన్లైన్ షాపింగ్ ద్వారా కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్లాన్ చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరగడంతో సంతోషంగా ఉండగలుగుతారు. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు గతంలో కంటే లాభాలు ఎక్కువగా పొందుతారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొందరికీ పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో గతంలో కంటే ఇప్పుడు లాభాలు పొందుతారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఈ రోజు మానసికంగా సంతృప్తితో ఉంటారు. కొన్ని పనులు పెండింగ్లో ఉండడంతో వాటిని పూర్తి చేయడానికి కృషి చేస్తారు.. అనేక రంగాల్లోని వారికి ఈరోజు విజయాలు లభిస్తాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలు పాల్గొనే ముందు గురువుల మద్దతు తీసుకోవాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని పనులు పూర్తికావడానికి కష్టతరం అవుతుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. వివాదాల్లో నుంచి బయటపడతారు. పరిష్కరించుకోవాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈరోజు శ్రీమహావిష్ణువు ఆశీస్సులు ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించవలసి వస్తుంది. గతంలో అనుకున్న పనులు ఇప్పుడు పూర్తి చేయడంతో మానసికంగా సంతృప్తిగా ఉంటారు. వ్యాపారులకు లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వీరు ఈరోజు సమస్యల నుంచి బయటపడతారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇతరలకు డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొందరు పక్కనే ఉంటూ మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారులు ప్రత్యర్థులపై దృష్టి పెట్టాలి. కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి గతంలో కంటే ఇప్పుడు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగుల ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కంపెనీల నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెడతారు. కొన్ని పనులు పూర్తికావడానికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులకు లాభాలు ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper