Today 29 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై ఉత్తరాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు గోరు పౌర్ణమి సందర్భంగా కొన్ని రాశుల వారికి కలిసి రానున్నాయి. మరికొన్ని రాశుల వారు ఈరోజు మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు అన్ని శుభవార్తలే అందుతాయి. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. వ్యాపారులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి సిద్ధమవుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వీటితో అనేక లాభాలు ఉంటాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఉద్యోగులకు ఈరోజు కీలకం అయ్యే అవకాశం ఉంది. కష్టపడి పని చేసిన వారికి సరైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. బంధువుల మధ్య విభేదాలు తొలగిపోయి సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. అయితే వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 ): . ఈ రాశి వారు వ్యక్తిగతంగా సమాజంలో గుర్తింపును పొందుతారు. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఏవైనా సమస్యలు ఉంటే కుటుంబ సభ్యులతో చర్చించుకోవడం మంచిది. విద్యార్థులు నైపుణ్య ప్రదర్శన ద్వారా పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. విశ్రాంతి లేకుండా పనులు చేయవద్దు. కొత్త అవకాశాలు వస్తుంటాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఏ పని మొదలుపెట్టిన సానుకూలమైన వాతావరణమే ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడమే మంచిది ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈరోజు పెద్దల ఆరోగ్యం విషయంలో దృష్టి పెట్టాలి. ఉద్యోగులు సహచారులతో సంతోషంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. వ్యాపారులకు అదనపు లాభాలు రావడానికి కొందరు సహాయం చేస్తారు. కష్టాలు దాదాపు తొలగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. బంధువుల నుంచి కీలకమైన సమాచారం అందుతుంది.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈరోజు కొన్ని తప్పులను సరి చేసుకుంటారు.. గతంలో చేసిన ముఖ్యమైన పనులను విషయంలో మరోసారి పరిశీలన చేస్తారు. కొన్ని విజయాలు చేకూరడంతో సంతోషంగా గడుపుతారు. పిల్లల కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూరప్ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే ఈ సమయంలో సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రత్యేకమైన ఆదాయం లభిస్తుంది. తెలివైన ఆలోచనలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం వంటివి చేయాల్సిన అవసరం ఉంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. నిరుద్యోగులు శుభవార్తలను వినే అవకాశముంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈరోజు కొత్త అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది. వ్యాపారులు సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులు ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తోటి వారి సహకారం తీసుకుంటారు. కొన్ని విషయాల్లో అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు. కష్టపడి పనిచేయడం ద్వారా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : సాంకేతిక రంగంలో పనిచేసే వారికి ఈరోజు కలిసి వస్తుంది. వ్యాపారులు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు పలుస్తాయి. ఉద్యోగులకు అధికారుల సపోర్టు ఉంటుంది. దీంతో ప్రాజెక్టులను పూర్తి చేయడంలో సక్సెస్ సాధిస్తారు. విద్యార్థులు పోటీపరీక్షలో పాల్గొనడానికి ఇదే సరైన సమయం. వాహనాలపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. ఎవరితోనూ అనవసరపు వాదనలు చేయకుండా ఉండడమే మంచిది. ఎవరికి ఆర్థిక వాగ్దానాలు ఇవ్వకూడదు. డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పాత స్నేహితులను కలవడం వల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అన్ని పనులు ఈరోజు పూర్తి చేయగలుగుతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవడం అవసరం. కొందరు అనవసరపు వాదనలు చేసినా కూడా సహనంతో వ్యవహరించాలి. తొందరపాటు చర్యలు నష్టానికి దారితీస్తాయి. మనసులోకి ప్రతికూల ఆలోచనలు రానివ్వకుండా ధ్యానం వంటివి చేయాలి. చాలా విషయాల్లో మౌనంగా ఉండటమే మంచిది.