HomeజాతీయంDelimitation Bill: డీలిమిటేషన్ బిల్లు.. ఇండియా కూటమికి మోదీ షా చావు దెబ్బ.. ఆ మాస్టర్...

Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు.. ఇండియా కూటమికి మోదీ షా చావు దెబ్బ.. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే..

Delimitation Bill: నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పార్లమెంటులో ఆమోదింప చేసుకోవడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. నవంబర్ 30 నుంచి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో.. ఇప్పుడే డీలిమిటేషన్ బిల్లు ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉంది. గత ఏప్రిల్ నెలలో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించలేక రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందలేదు. ఈసారి మాత్రం అవసరమైన సంఖ్యా బలాన్ని సమకూర్చుకోవడానికి కేంద్రం వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్లో 540 మంది […]

Delimitation Bill: నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పార్లమెంటులో ఆమోదింప చేసుకోవడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. నవంబర్ 30 నుంచి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో.. ఇప్పుడే డీలిమిటేషన్ బిల్లు ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉంది. గత ఏప్రిల్ నెలలో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించలేక రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందలేదు. ఈసారి మాత్రం అవసరమైన సంఖ్యా బలాన్ని సమకూర్చుకోవడానికి కేంద్రం వ్యూహాలు రచిస్తోంది.

పార్లమెంట్లో 540 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొంటే.. బిల్లు ఆమోదం పొందడానికి 360 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఇండియా కు 320 మంది సభ్యుల మద్దతు ఉంది. వైసిపి.. ఇండిపెండెంట్ లు.. యుపిపిఎల్.. జెడ్ పి యం పార్టీలతో పాటు డీఎంకే.. శరద్ పవర్ నేతృత్వంలో ఎన్సిపి.. ఎస్పి మద్దతు కూడా లభిస్తే ఈ సంఖ్య 358కి చేరుతుంది. దీంతో మెజారిటీకి అవసరమైన మరో రెండు ఓట్లపై ఆసక్తి ఏర్పడింది.

డీఎంకే వైఖరిలో మార్పు

డీ లిమిటెడ్ బిల్కు సంబంధించి తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే వైఖరి కీలకంగా మారింది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళనతో ఆ పార్టీ గతంలో బిల్లును వ్యతిరేకించింది. పార్లమెంట్లో జరిగిన చర్చల సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలో 50% సీట్లు పంచుతామని.. దక్షిణాది ప్రాంతాల రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. బిల్లులో అవసరమైన చట్టపరమైన మార్పులు చేసినందుకు కూడా కేంద్రం అంగీకరించడంతో డిఎంకె తన వైఖరి మార్చుకున్నట్టు సంకేతాలు వచ్చింది. డ్రాఫ్ట్ బిల్లులో తమ సూచనలకు అవకాశం కల్పిస్తే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు డీఎంకే సీనియర్ నాయకులు ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

పవార్ వర్గం సానుకూలం

మహారాష్ట్రకు చెందిన ఎన్సిపి , ఎస్పీ కూడా డీలిమినేషన్ బిల్లుకు సానుకూలంగా సంకేతాలు ఇస్తుంది. మహిళ రిజర్వేషన్ బిల్లు అమలు.. అన్ని రాష్ట్రాలలో 50% సీట్ల పెంపు.. డీలిమిటేషన్ కమిషన్ లో ప్రతిపక్షాలకు ప్రాతినిధ్యం కల్పించడం వంటి మూడు ప్రధాన డిమాండ్లను కేంద్రం అంగీకరిస్తే బిల్లుకు సపోర్ట్ చేస్తామని సుప్రియ ఇప్పటికే వెల్లడించారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారిపోయాయి. డీఎంకే.. ఎన్సిపి.. ఎస్పీ పార్టీలు బిజెపికి దగ్గరవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్తి చిదంబరం సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందించారు. మరోవైపు టీఎంసీ కి చెందిన 20 మంది ఎంపీలు పార్టీ నుంచి విడిపోయారు. శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన ఆరు ఎంపీలు షిండే వర్గంలో చేరడం వంటి పరిణామాలు కూడా తాజా రాజకీయ సమీకరణాలలో ప్రస్తావనకు దారితీస్తున్నాయి.

సమాజ్వాది పార్టీ మద్దతుపై ఆశలు

ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఎన్డీఏకు అనుకూలంగా 358 మంది సభ్యుల మద్దతు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. బిల్లు ఆమోదానికి అవసరమైన 360 ఓట్ల సంఖ్యను చేరుకోవడానికి మరో ఇద్దరు సభ్యుల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో సమాజ్వాది పార్టీ వైఖరి పై చర్చ నడుస్తోంది. ఓటింగ్ సమయంలో కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు హాజరు కాకపోతే సభలో పాల్గొని ఓటు వేసిన సభ్యుల సంఖ్య ఆధారంగా మూడింట రెండు వంతుల మెజారిటీ లెక్క మారే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ల అమలుతో ముడిపడి ఉన్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కేంద్రం ఈసారి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను పరిష్కరించే హామీలు.. ప్రతిపక్ష పార్టీలతో చర్చ.. సంఖ్య బలంపై కసరత్తుతో మోడీ, షా ముందుకు సాగుతోంది. నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లుపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper