Homeఆధ్యాత్మికంToday 28th August 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం.. ఆగిపోయిన...

Today 28th August 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం.. ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం..

Today 28th August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడంతో అనుకున్న పనులను త్వరగా పూర్తి చేయగలుగుతారు. మరికొన్ని రాశుల వారు కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): రాఖీ పౌర్ణమి వేళ ఈ […]

Today 28th August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడంతో అనుకున్న పనులను త్వరగా పూర్తి చేయగలుగుతారు. మరికొన్ని రాశుల వారు కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): రాఖీ పౌర్ణమి వేళ ఈ రాశి వారికి ఈ రోజు కలిసి రానుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విభేదాలు తొలగిపోతాయి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు ఈరోజు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండాలి. కత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి ఆదాయం ఈరోజు పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఉన్నట్లుండి ఊహించని లాభాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. కొత్త వస్తువుల కొనుగోలుకు ఇదే మంచి సమయం. ఇతరులకు డబ్బు అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయమవుతారు. వీరితో అదనపు ఆదాయం వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులు కొత్త బాధ్యతలను చేపడతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. స్నేహితుల మధ్య సత్సంబంధాలు పెరిగిపోతాయి.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు విశేష ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులను ఘనంగా లాభాలు పొందుతారు. ప్రియమైన వారితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధికంగా లాభాలు ఉంటాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం ఎరుగుపడుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి అవకాశం. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. వ్యాపారులో ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు అనుకున్న ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాజు వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో ఉల్లాసంగా ఉంటారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులో పాల్గొంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనుంది. దీంతో కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉండడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కెరీర్ విషయంలో కీలకమైన తీసుకుంటారు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తక్కువగా ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper