Pakistan Cycle Ambulance: ప్రపంచం మొత్తం ఒకదారిలో వెళ్తుంటే.. పాకిస్తాన్ మాత్రం మరోదారిలో వెళ్తూ ఉంటుంది. తెలిసి చేస్తుందా.. తెలియక చేస్తుందా అర్థం కాదు గాని.. పిచ్చి పిచ్చి పనులు మొత్తం ఆ దేశమే చేస్తుంది. అసలు ఇటువంటి ఆలోచనలు ఆ దేశ పరిపాలకులకు ఎందుకు వస్తాయో తెలియదు. ఎందుకలా చేస్తారో అర్థం కాదు. ఒకప్పుడు ఇటువంటి విషయాలు పాకిస్తాన్ గురించి పెద్దగా వెలుగులోకి వచ్చేవి కావు. కానీ ఇప్పటి కాలంలో పాకిస్తాన్ ఏం చేసినా సరే క్షణంలోనే తెలిసిపోతుంది. ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం అలా ఉంది మరి.
ప్రపంచంలో అత్యవసర వైద్య సర్వీసులు అందించడానికి రకరకాల మార్గాలను అందుబాటులో తీసుకొచ్చారు. మన దేశంలో అయితే ఇప్పుడు ఎయిర్ అంబులెన్స్ విశేషమైన ప్రాచుర్యం పొందింది. అత్యవసరమైన వైద్య సేవలు అందించాల్సిన రోగులను వాయు మార్గంలో తరలిస్తున్నారు. ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతున్నారు. కొన్ని సందర్భాలలో డ్రోన్ సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు. వైద్య సేవలో భారత్ మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలు సరికొత్త విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాయి. అదేవిధంగా అడుగులు వేస్తున్నాయి.
ప్రపంచం మొత్తం ఒకదారిలో ఉంటే.. పాకిస్తాన్ మాత్రం మరోదారిలో ఉంటున్నది. అసలు ఆ దేశం అలా ఎందుకు ఆలోచిస్తోంది.. అనేది ఎంతకీ అర్థం కావడం లేదు. పాకిస్తాన్ దేశంలో సరికొత్తగా సైకిల్ అంబులెన్స్ అనే విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అసలు సైకిల్ మీద అంబులెన్స్ ఏర్పాటు చేయడమే ఒక వింత. పైగా దానిని ప్రపంచ వింతగా ప్రచారం చేసుకుంది పాకిస్తాన్. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి.
ఊరంతా ఒకదారి అయితే.. ఉలిపి కట్టది మరొకదారి. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అలానే మారింది. ఆ దేశంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఉండవు. శాస్త్రవేత్తలకు మనుగడ ఉండదు. కేవలం ఉగ్రవాదం మాత్రమే ఉంటుంది. చివరికి ప్రపంచం మొత్తం సాంకేతిక యుగంలో ప్రయాణం సాగిస్తూ ఉంటే.. పాకిస్తాన్ మాత్రం సైకిల్ మీద పయనం సాగిస్తూ ఉంటుంది. చివరికి సైకిల్ అంబులెన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చి తానేదో గొప్ప పని చేసినట్టు బిల్డప్ ఇస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో ఈ స్థాయిలో నెగిటివ్ ప్రచారం జరుగుతున్నప్పటికీ పాకిస్థాన్ పాలకులు మారడం లేదు. పైగా ఇదేదో గొప్ప అని అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు.
View this post on Instagram