Today 29 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాసులపై పూర్వాభద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మరి కొన్ని రాశుల వారు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి అవకాశం. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు కార్యాలయాలు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కొత్త బాగా స్వాములతో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వాదనలకు వెళ్ళద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాయామంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి వ్యాపారంలో ఈరోజు అధిక లాభాలు ఉంటాయి. పాద సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. నాణ్యమైన సమయాన్ని పిల్లలతో గడుపుతారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతోంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు నైపుణ్యం ప్రదర్శించడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకూల సమయం. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో సరదాగా ఉంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వీటినుంచి బయట పడడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు బడ్జెట్ ప్రకారం ఖర్చులు ఉంటాయి. విద్యార్థులకు ఏకాగ్రత లభిస్తుంది. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. మార్కెటింగ్ లో ఉండే వారికి కలిసి వస్తుంది. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు వెళ్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు దీర్ఘకాలిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇష్టమైన పనుల కోసం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. మీడియా రంగాల్లో ఉన్నవారికి విశేషమైన గుర్తింపు ఉంటుంది. వ్యాపారులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వీరితో లాభ పరిధి పెరుగుతుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మార్కెటింగ్ లో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. నిద్ర ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆహార విషయంలో రాజీ పడవద్దు. వ్యాపారులు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అంతా ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఆస్తి వ్యవహారాల్లో శుభవార్తను అందుతాయి. గతంలో మొదలు పెట్టిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. అనవసరపు వాదనలకు దూరంగా ఉండడం మంచిది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారుల సపోర్టుతో ఉద్యోగులు ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కీలకమైన పెట్టుబడులు పెడతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈరోజు ఉద్యోగులు నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబంలో భావోద్వేగాలు ఏర్పడతాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.