కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం విధించిన రెండో విడత లాక్ డౌన్ గడువు మే 3 దగ్గర పడుతోంది. అయితే దేశంలో ఇంకా కరోనా కేసుల సంఖ్య కొనసాగుతూనే ఉంది. రోజుకు దాదాపు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదే సమయంలో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు నమోదు కాని జిల్లాల సంఖ్య కూడా గణనీయంగా ఉందని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో రెండో విడత లాక్ డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ మే 2న ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కరోనాపై దేశం సాగిస్తున్న యుద్ధంలో ఈ మే నెల కీలకం కానుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న కేసులతో కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరుకోవడమా లేదా ప్రభుత్వం చేపట్టే కట్టుదిట్టమైన చర్యలతో వేగం నెమ్మదించడమా అన్నది మే నెలలో తేలే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
కరోనా హాట్‌స్పాట్లుగా ఉన్న ప్రాంతాల్లో నియంత్రణా చర్యలను మరింత ప్రణాళికాబద్ధంగా రూపొందించాల్సిన అవసరం ఉందని, దీంతో పాటుగా గ్రీన్ జోన్లలో ఆంక్షల సడలింపు ఇచ్చేట్లు అయితే ఆయా ప్రాంతాలపై కూడా నిరంతర పర్యవేక్షణ ఉండాలని వైద్య నిపుణలు అభిప్రాయపడ్డారు. మే నెల పూర్తి వరకూ రైల్వేలు, విమానాలు, అంతరాష్ట్ర బస్సు సర్వీసులు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మతపరమైన కార్యక్రమాలు, తదితరాలను
అనుమతించకూడదని సూచించారు. కరోనాపై పోరును కొనసాగించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కూడా ముఖ్యమని ప్రధాని మోడీ సోమవారం పలురాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో మే 3 తర్వాత కూడా కొన్ని సేవలు, రంగాలకు ఆంక్షలతో కూడిన అనుమతులతో లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉందని కేంద్రం సూచనాప్రాయంగా చెప్పింది.
భారత్ లో ఇటీవలనే మరణాల సంఖ్య వెయ్యి దాటగా, ఆయా దేశా ల్లో ఇప్పటికే వేల సంఖ్యలో చనిపోయారు.కాబట్టి అమెరికా, ఇటలీ, యుకె, ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం వంటి దేశాలతో పోల్చుకుంటే కేసుల సంఖ్యతో పాటు మరణాల రేటులో కూడా తక్కువగా ఉంది. కేసుల రెట్టింపు రేటు కూడా తగ్గిందని భారత ప్రభుత్వం పేర్కొంది. మొదట్లో 3 రోజులుగా ఉన్న రెట్టింపు రేటు, ప్రస్తుతానికి 10కి పెరిగిందని తెలిపింది.
దేశంలో గత 15 రోజుల కాలంలో కరోనా హాట్ స్పాట్ జిల్లాలు 170 నుంచి 129కు తగ్గాయని, కానీ ఇదే సమయంలో ఇన్ఫెక్షన్ రహిత జిల్లాలు లేదా గ్రీన్‌జోన్ ప్రాంతాలు కూడా 325 నుంచి 307కు తగ్గాయని అధికారిక వర్గాల సమాచారం. నాన్ హాట్‌స్పాట్(ఆరంజ్ జోన్) జిల్లాల సంఖ్య 207 నుంచి 297కు పెరిగింది. దింతో లాక్ డౌన్ ను కొనసాగించడమే మంచిదనేది అర్థమౌతుంది
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Number of corona cases in the country continues
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com