
ఆహ్లాదకర చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ కుటుంబ సమేతంగా చూడతగ్గ ఆణిముత్యాలే… ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా ” వంటి సినిమాలను అచ్చ తెలుగు తనానికి ఆనవాళ్లు .వాటిని మనం అంత సులభంగా మరచిపోలేం. ఇక ఆయన దర్శకత్వం వహించిన గత చిత్రం ” ఫిదా “గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెన్సేషనల్ హిట్ సాధించిన ఈ చిత్రంలో మధ్య తరగతి వారి మనస్తత్వాలను దర్శకుడు ఆవిష్కరించిన తీరు అమోఘం. ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో “లవ్‌స్టోరీ” అనే ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. కరోనా సమస్య లేకుండా ఉంటే ఈ పాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చుండేది.
చిరంజీవి రాజకీయాలపై తమ్ముడి షాకింగ్ కామెంట్
ఇక ఈ చిత్రం తరవాత శేఖర్ కమ్ముల తన రొటీన్ జానర్ కి భిన్నంగా వెళ్లాలనుకుంటున్నాడట. ప్రేమ కథా చిత్రాల స్థానంలో ఒక థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాలని అనుకొంటున్నాడట….. గతంలో ` కహాని ` హిందీ సినిమాని తెలుగులో `అనామిక ` పేరుతో తెరకెక్కించి నప్పటికీ సత్పలితం రాలేదు. దరిమిలా శేఖర్ కమ్ముల థ్రిల్లర్ జోనర్‌లో సినిమా తీస్తున్నానంటే అందరూ ఆశ్చర్య పోతున్నారు . లాక్ డౌన్ ఎత్తి వేయగానే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు బయటికి రానున్నాయి .