Narendra Modi : దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆరోగ్యం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో జెన్ జెడ్ తరానికి పోటీగా నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశారు . సెల్ఫీ వీడియోలలో తన అభిప్రాయాన్ని అందులో పొందుపరిచారు. ముఖ్యంగా పేపర్ లీక్ వ్యవహారంలో నరేంద్ర మోడీ కీలక విషయాలను బయటపెట్టారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు.. భవిష్యత్తు కాలంలో పేపర్ లీక్ అనేది జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
తన శైలికి భిన్నంగా నరేంద్ర మోడీ ఏకంగా మూడు సెల్ఫీ వీడియోలు షూట్ చేశారు. ఆ తర్వాత వాటిని అర్ధరాత్రి పూట తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆయన మాట్లాడుకుంటూ డియర్ ఫ్రెండ్స్ అంటూ.. జెన్ జడ్ తరాన్ని సంబోధించారు. తద్వారా యువతరానికి నరేంద్ర మోడీ దగ్గర అయ్యారు. ప్రస్తుతం పార్లమెంట్లో పేపర్ లీక్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు పాస్ అయింది.
ఈ బిల్ పాస్ అయిన తర్వాత.. జాతీయ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. ప్రధానంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తీరును కూడా తప్పు పట్టింది. ఇవన్నీ కూడా దేశ రాజకీయాలలో సంచలనంగా మారాయి. అయితే ఈ అంశాలకు మించి ప్రధాని నరేంద్ర మోడీ ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారం సోషల్ మీడియాలో.. ప్రధాన మీడియాలో విస్తృతంగా చర్చకు వస్తోంది.
పేపర్ లీకేజీ పై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివరించారు. ఆ వీడియోలను తన ఇంస్టాగ్రామ్ లో రిలీజ్ చేశారు. అయితే ఈ నెల 26న పోస్ట్ చేసిన మూడవ రీల్ లో నరేంద్ర మోడీ చేతులు కాస్త వణుకుతున్నట్టు కనిపించాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అవుతున్నాయి. నరేంద్ర మోడీ అభిమానులు ఆయన ఆరోగ్యం మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. 75 సంవత్సరాల వయసులో శరీరంలో ఇలాంటి మార్పులు సహజమేనని వారు చెబుతున్నారు. మరికొందరేమో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిజైన్ చేయాలని సెటైర్లు వేస్తున్నారు.
నరేంద్ర మోడీ ఇంతవరకు ఎన్నడు అనారోగ్యానికి గురి కాలేదు. ఆయన సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. నవరాత్రుల సమయంలో ఉపవాసం ఉంటారు. కేవలం గోరువెచ్చని నీళ్లు.. తేనె మాత్రమే కలుపుకొని తాగుతుంటారు. పైగా కిందనే పడుకుంటారు. గుజరాతి వంటకాలను నరేంద్ర మోడీ అమితంగా తింటుంటారు. నరేంద్ర మోడీ ఇంతవరకు ఆయన తన జీవితకాలంలో ఎన్నడూ కూడా మాంసాహారాన్ని తినలేదు. మద్యం ముట్టలేదు.
View this post on Instagram