ఆర్థిక సమస్యలు, కరోనా ఇబ్బందులు చుట్టుముట్టినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక రంగ ఆర్థిక పరిపుష్ఠికి అవసరమైన చర్యలకు సీఎం శ్రీకారం చుట్టారు.
పరిశ్రమలలో పని చేసే కార్మికులను కోవిడ్ –19 ప్రభావం నుంచి కాపాడేందుకు అవసరమైన ముందస్తు చర్యలను చేపడతున్న ప్రభుత్వం ఈ క్రమంలో ప్రోత్సాహకాలు, బకాయిలు, విద్యుత్ ఛార్జీల వంటి కీలక అంశాలన్నింటిలో పరిశ్రమలకు ఉపశమనం కలిగించే నిర్ణయాలతో రాష్ట్ర పారిశ్రామిక రంగం ఉత్తేజంతో తిరిగి పట్టాలకెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కీలక సమీక్ష నిర్వహించిన అనంతరం సమీక్షా సమావేశంలోని ఇందుకు సంభవించిన నిర్ణయాలు తీసుకున్నారు.
నేటి నుంచే ఏపీలో పెన్షన్ల పంపిణీ!
ఎమ్ఎస్ఎమ్ఈలకు భరోసానిచ్చే కచ్చితమైన ఆర్థికరక్షణ ప్రణాళిక అమలుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం మంచిపరిణామమని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. గత ఐదేళ్లలోనూ చెల్లించని ప్రోత్సాహకాల బకాయిలను చెల్లించే నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఎమ్ఎస్ఎమ్ఈలకు ఉపశమనమిచ్చే నిర్ణయం తీసుకుంది. 2014–15 నుంచి 2018-2019 మధ్యకాలంలో మొత్తం ఎమ్ఎస్ఎమ్ఈ ప్రోత్సాహక బకాయిలు రూ. 828 కోట్లు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20 ఎంఎస్‌ఈలకు (అప్‌లోడ్ చేసిన వివరాల ప్రకారం) బకాయిలు రూ. 77 కోట్లు కలిపి మొత్తంగా రూ.905 కోట్లను మే, జూన్ నెలలో ఎంఎస్‌ఎంఈలకు ఇస్తామని సీఎం ప్రకటించారు. విడతల వారీగా మే నెలలో సగం, జూన్ నెలలో మరో సగం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఎమ్ఎస్‌ఎమ్ఈల మినిమం కరెంటు డిమాండ్ ఛార్జీల రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్.. ఈ మూడు నెలల కాలంలో ఎమ్ఎస్ఎమ్ఈలకు పవర్ డిమాండ్ ఛార్జీలు రూ. 188 కోట్లు మాఫీ చేయనున్నామన్నారు. మిగిలిన పరిశ్రమలకు మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్ )కరెంటు మినిమం డిమాండ్ ఛార్జీల చెల్లింపులో వాయిదాలకు అనుమతించామన్నారు. ఈ రెండు నిర్ణయాల కారణంగా 72,531 సూక్ష్మ పరిశ్రమలకూ, 24,252 చిన్న తరహా పరిశ్రమలకూ, 645 మధ్య పరిశ్రమలకూ మొత్తంగా 97, 428 ఎమ్ఎస్‌ఎమ్ఈలకు మేలు జరగనుంది. తద్వారా వాటిల్లో పనిచేసే 9,68,269 మందికి ఉపాధి విషయంలో కొంత వరకూ ఇబ్బందులు తొలగుతాయి. ప్రస్తుతం ఎమ్ఎస్‌ఎమ్ఈలు తమ కార్యకలాపాలను పునరుద్ధరించుకోవడానికి వీలుగా, ఆర్థిక వనరుల సమీకరణలో తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం బ్యాంకులకు గ్యారంటీ ఇస్తూ సబ్సిడీతో ఒప్పందం కుదుర్చుకుని, రూ.200 కోట్లు సమకూర్చుకుని, వాటిని వర్కింగ్ కేపిటల్‌గా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు అందించాలని నిర్ణయించారు. అతితక్కువ వడ్డీకింద ఈ వర్కింగ్ కేపిటల్ సమకూర్చాలని సమావేశంలో నిర్ణయం.
వస్త్ర పరిశ్రమల ప్రోత్సాహకాలకు సంబంధించిన రూ.1088 కోట్ల బకాయిలను చెల్లించేందుకు కూడా త్వరలో నిర్ణయం తీసుకొనున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు వచ్చాక టెక్ట్స్‌టైల్ సహా ఇతర పరిశ్రమలను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన మరిన్ని చర్యలు చేపట్టనున్నారు. వస్త్ర పరిశ్రమలు సహా, భారీ, అతిపెద్ద పరిశ్రమలకు 3నెలల ( ఏప్రిల్, మే, జూన్ నెలల) మినిమమం డిమాండ్ ఛార్జీల చెల్లింపును వాయిదా వేయాలని నిర్ణయించారు. వీటికి ఎలాంటి అపరాధరుసుము, అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Ap was the first state to guarantee msmes minister mekapati
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com