Sonia Rahul Gandhi : సోనియా, రాహుల్ గాంధీ.. నెహ్రూ కుటుంబంలో ఇటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు లేరు. నెహ్రూ విధానపరమైన నిర్ణయాల్లో రాజీ పడ్డారని నెహ్రూపై విమర్శలున్నాయి. చైనా, కశ్మీర్ విషయంలో వెనక్కి తగ్గాడని నెహ్రూను ఆడిపోసుకుంటారు. ఇక ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ పెట్టి విమర్శలపాలయ్యారు. ఇక రాజీవ్ గాంధీపై భోపోర్స్ కేసుపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. చివరకు అది నిరూపణ కాలేదు కోర్టులో.
ఇవాళ సోనియా, రాహుల్ కలిసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5వేల కోట్ల రూపాయలు ఆస్తిని.. నేరపూరితంగా తమ సొంత చేసుకోవాలనే కుట్రను పన్నినట్టు ఈడీ విచారణలో తేలింది.ఈ మేరకు ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేయడంతో 25వ తేదీన విచారణ ఎదుర్కోబోవడం ఇప్పుడు జరిగిన పరిణామం.
11వ తేదీన ఆ ఆస్తులకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆదాయం ఈడీ అకౌంట్లోనే జమ చేయాలని నోటిఫికేషన్ వేశారు.
2013లో సుబ్రహ్మణ స్వామి ఈ సోనియా రాహుల్ పై ఈ కేసు వేశారు. కాంగ్రెస్ ఆస్తులను వీళ్లు కాజేస్తున్నారని పిటీషన్ వేశారు. కోర్టుల్లోనూ దీనిపై ఆధారాలు ఉండడంతో విచారణ జరిగింది. 2021 ఈడీ ఈ కేసును టేకప్ చేసింది. ఆస్తులను జప్తు చేసింది.
కాంగ్రెస్ కోట్ల ఆస్తిని నేరపూరితంగా స్వంతం చేసుకున్నారని ఈడీ ఆరోపణ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు