Daggubati Purandeswari: ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి( AP BJP Chief Poran deshwari ) పదవి మార్పు ఖాయమా? ఈ మేరకు కేంద్రం నుంచి సంకేతాలు అందాయా? బిజెపి ఏపీ చీఫ్ పదవి వదులుకోవాలని ఆదేశాలు వచ్చాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా బిజెపి సంస్థాగత మార్పుల్లో భాగంగా ఏపీ బీజేపీ చీఫ్ ను మారుస్తారని ప్రచారం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు అధ్యక్షులు మార్పు ఉంటుందని టాక్ నడుస్తోంది. అయితే తన విషయంలో పునరాలోచన చేయాలని పురందేశ్వరి హై కమాండును కోరుతూ వచ్చారు. అయితే అదే హై కమాండ్ నుంచి భిన్నమైన సంకేతాలు రావడంతో పురందేశ్వరిలో ఆందోళన ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
Also Read: ఏపీ బీజేపీ చీఫ్ ఆయనే.. సోము వీర్రాజు ఎంట్రీ తో మారిన సీన్
* రెండేళ్ల కిందట ఎంపిక..
ఏపీ బీజేపీ చీఫ్ గా రెండు సంవత్సరాల కిందట నియమితులయ్యారు పురందేశ్వరి. సోము వీర్రాజు( Somveer Raju ) చాలా రోజులపాటు ఏపీ బీజేపీ చీఫ్ గా వ్యవహరించారు. అయితే ఉన్నట్టుండి ఆయనను మార్పు చేసి పురందేశ్వరిని అధ్యక్షురాలుగా నియమించారు. అయితే దీని వెనుక చంద్రబాబు హస్తము ఉందన్నది ఒక ఆరోపణ. అందుకు తగ్గట్టుగానే పురందేశ్వరి టిడిపి తో పొత్తు కోసం శతవిధాలా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. ఆమె బిజెపి కంటే టిడిపి ప్రయోజనాలకి పెద్దపీట వేశారు అన్న విమర్శ ఉంది. అయితే ఆమె నేతృత్వంలో బిజెపి ఏపీలో సీట్లతో పాటు ఓట్లు కూడా పెంచుకుంది. 8 అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు పార్లమెంటు సీట్లను కైవసం చేసుకుంది. తద్వారా హై కమాండ్ వద్ద ఆమె పరపతి పెంచుకున్నారు.
* చంద్రబాబుతో సయోధ్య..
అయితే తెలుగుదేశం( Telugu Desam ) పార్టీతో పాటు అధినేత చంద్రబాబుతో సయోధ్య ఏర్పాటు చేసుకున్నారు పురందేశ్వరి. గతంలో ఇదే తెలుగుదేశం పార్టీని విభేదించి కాంగ్రెస్కు దగ్గరయ్యారు పురందేశ్వరి. 2004 లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2009లో రెండోసారి గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. అయితే అనూహ్య పరిస్థితుల్లో బిజెపికి దగ్గరయ్యారు ఆమె. అదే సమయంలో తెలుగుదేశం పార్టీతో పాటు అధినేత చంద్రబాబుపై అభిప్రాయాన్ని మార్చుకున్నారు. బిజెపి కంటే తెలుగుదేశం ప్రయోజనాలకి ఆమె పెద్ద పీట వేశారన్న విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే ఆమె నేతృత్వంలోని బిజెపి తెలుగుదేశం, జనసేన తో పొత్తు పెట్టుకుని సీట్ల పరంగా మెరుగైన స్థానాలను సాధించింది. ఓట్లను సైతం పెంచుకుంది. అయితే బిజెపి నిబంధనల మేరకు ఆమె మార్పు ఖాయమని తేలింది.
* పదవిలో కొనసాగాలని..
అయితే కొద్ది రోజులపాటు బిజెపి( Bhartiya Janata Party) రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగాలని పురందేశ్వరి అభిప్రాయం. ఇదే విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో చంద్రబాబు సైతం సిఫారసు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ కేంద్ర పెద్దలు మాత్రం పురందేశ్వరి విషయంలో మార్పు చేయాలన్న ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. అయితే చివరి ప్రయత్నం గా చంద్రబాబు ద్వారా ఆమె గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆమె విషయంలో బిజెపి హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.