kavery Water Dispute : ఈ సమస్య ఇప్పటిది కాదు. దశాబ్దాలు నాటిది. ఇంతవరకు పరిష్కార మార్గం దొరకలేదు. పరిష్కరించే బాధ్యత ఎవరూ తీసుకోలేదు.. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారు చేసుకున్నారు.
అందువల్లే ఈ సమస్య మళ్లీ రిపీట్ అయింది. ఈసారి రాచ పుండు మాదిరిగా ఇబ్బంది పెడుతోంది. రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బంది కరమైన వాతావరణానికి కారణమవుతోంది. దక్షిణాది రాష్ట్రాలలో ప్రముఖమైనవి తమిళనాడు, కర్ణాటక. ఈ రెండు రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల వివాదం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది.
ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తో విజయ్ ప్రభుత్వానికి కొనసాగిస్తున్నారు. కావేరి జలాల వివాదం నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ వివాదం కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారిపోయింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తమిళనాడులో అధికార పార్టీకి సపోర్ట్ చేస్తోంది. రెండు రాష్ట్రాలలో నాయకులకు బలమైన సెంటిమెంట్లను కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో అర్థం కావడం లేదు . ఇందులో ఏమాత్రం పొరపాటు జరిగినా సరే కాంగ్రెస్ పార్టీ దుకాణం సర్దుకోవాల్సిందే .
ఇటీవల రివర్ రెగ్యులేషన్ కమిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం తమిళనాడు రాష్ట్రానికి రోజు 3500 క్యూసెక్కుల కావేరి నది నీటిని విడుదల చేయాలి. ఈ ఆదేశాలు రావడమే ఆలస్యం కర్ణాటకలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వర్షాలు లేకపోవడంతో సరిగ్గా నీటి నిల్వలేదని.. ఇలాంటి సమయంలో నీరు విడుదల చేయడం కష్టమని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే క్లారిటీ ఇచ్చారు. అయితే పరిస్థితి చేయి దాటిపోతున్న నేపథ్యంలో నేరుగా కర్ణాటక వచ్చి శివకుమార్ తో మాట్లాడాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయించారు. అయితే కర్ణాటక రాష్ట్రంలో అక్కడి ప్రజలు.. ఇతర సంఘాల నుంచి తిరుగుబాటు విపరీతంగా ఉండడంతో విజయ్ పర్యటనను రద్దు చేసుకోవాలని శివకుమార్ సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్ణాటక రాష్ట్రానికి అసలు రావద్దని శివకుమార్ విజయ్ కి సూచించారు.
తమిళనాడు రాజకీయాలను కావేరి నది నీటిని వేరుగా చూడడం సాధ్యం కాదు . కావేరి నది నీటి ఆధారంగానే తమిళనాడు రైతులు పంటలు సాగు చేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కర్ణాటక ఒత్తిడికి తలవంచితే విజయ్ కి తమిళనాడు రాష్ట్రంలో ఇబ్బందికరమైన పరిణామం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ ప్రభుత్వం కావేరి నది జలాల వ్యవహారాన్ని సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని భావించింది. మరోవైపు విజయ్ క్యాబినెట్ లో ఉన్న చాలామంది మంత్రులు కర్ణాటక ముఖ్యమంత్రి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కావేరి నది నీళ్లు విడుదల చేయకపోతే.. విజయ్ తన ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ఇచ్చిన సపోర్ట్ పై ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అక్కడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తమిళనాడు మంకుపట్టు వీడకపోవడం.. కర్ణాటక ప్రభుత్వం పట్టుదలతో ఉండడంతో కావేరి వివాదం కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి పై స్థానిక రైతులు.. బిజెపి.. జెడిఎస్ పార్టీల నుంచి ఒత్తిడి వస్తోంది. ఒకవేళ కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడుకు కావేరి నది జలాలు విడుదల చేస్తే మాత్రం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకోపోయే ప్రమాదం ఉంది. అందువల్లే ఓటు బ్యాంకు ను కాపాడుకోవడానికి.. బిజెపి వేసిన ఉచ్చు నుంచి రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. దీనికి తోడు ఇటీవల శివకుమార్ ఆధ్వర్యంలో తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించిన మేకదాటు ప్రాజెక్టును ఏకపక్షంగా వ్యతిరేకించారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం మరింత పెరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ సెంటిమెంట్లు అధికంగా ఉంటాయి.. ఈ సెంటిమెంట్లకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ పుట్టి కావేరిలో మునగడం ఖాయం.