Homeజాతీయ వార్తలుDelhi NEET Protest: విద్యార్థులే మనుషులా.. పోలీసులు కాదా.. వీళ్ళ ప్రశ్నకు దేశమే నివ్వెర పోయింది..

Delhi NEET Protest: విద్యార్థులే మనుషులా.. పోలీసులు కాదా.. వీళ్ళ ప్రశ్నకు దేశమే నివ్వెర పోయింది..

Delhi NEET Protest: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో నీట్ విద్యార్థులు ఆందోళన చేశారు. క్వశ్చన్ పేపర్ లీక్ ఘటనలో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఢిల్లీ నగరంలో ఉన్న జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీట్ విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కొంతమంది అసాంఘిక శక్తులు కూడా పాల్గొన్నారని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. […]

Delhi NEET Protest: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో నీట్ విద్యార్థులు ఆందోళన చేశారు. క్వశ్చన్ పేపర్ లీక్ ఘటనలో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి.

ఢిల్లీ నగరంలో ఉన్న జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీట్ విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కొంతమంది అసాంఘిక శక్తులు కూడా పాల్గొన్నారని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు విధ్వంసానికి పాల్పడ్డారు. హింసాత్మక ఘటనలకు కారణమయ్యేలాగా ప్రవర్తించారు. పోలీసులు కూడా తమ లాఠీలకు పని చెప్పడంతో.. అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

పోలీసులు జరిపిన లాఠీచార్జీలో చాలామంది విద్యార్థులు గాయపడ్డారు. విద్యార్థులు హింసాత్మక ఘటనలకు పాల్పడడంతో చాలామంది పోలీసులు గాయపడ్డారు. అయితే చాలామంది విద్యార్థులను మాత్రమే బాధిత పక్షం లాగా చూపిస్తున్నారు. మొత్తం తప్పు పోలీసులదే అన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ చర్చ ఏకంగా పార్లమెంటు వేదికగా సాగుతోంది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అయితే ఏకపక్షంగా పోలీసుల మీద విమర్శలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో పోలీస్ ఆఫీసర్ కుమార్తె మీడియా ముందుకొచ్చింది. నాడు ఢిల్లీలో జరిగిన సంఘటనలను ఆమె పూస గుచ్చినట్టు బయటపెట్టింది.

“మా నాన్న ఒక పోలీసు అధికారి. 15 సంవత్సరాలు పాటు నేవీలో పని చేశారు. ఇప్పుడు ఆయన ఢిల్లీ పోలీసు భాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. మా నాన్న ఇటీవల అక్కడ విధులు నిర్వహించారు. ప్రతిరోజు రాత్రి ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ జరిగే పరిస్థితుల గురించి చెప్పేవారు. నీట్ విద్యార్థుల ఆందోళనలో అక్కడి స్టూడెంట్స్ ముసుగులో కొంతమంది వేరే వ్యక్తులు చేరారని అనేవారు. వారంతా కూడా మా నాన్నను లాగారు. మూకుమడిగా దాడి చేయడానికి ప్రయత్నించారు. మా నాన్న ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఖాకీ చొక్కా నిండా రుధిరమే. ఈ సంఘటన జరిగిన తర్వాత వినకూడనిది విన్నాను. మా తండ్రిని నేరస్థుడిలాగా చిత్రీకరించడం మొదలుపెట్టారు. నాడు ఆయన మీద దాడి చేసిన వారు ఇప్పుడు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. పైగా సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. ఇప్పుడు నేను గట్టిగా డిసైడ్ అయ్యాను. మా కుటుంబానికి న్యాయం చేయాలి. గాయపడిన పోలీసు కుటుంబాలతో కలిసి మేము సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశామని” ఆ ఎస్ఐ కుమార్తె వెల్లడించారు..

“నా భర్త 33 సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఆయన ప్రస్తుతం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా కొనసాగుతున్నారు. నా భర్త మీద కొంతమంది మూకుమ్మడిగా దాడి చేశారు. ఆ దాడిలో నా భర్త హెల్మెట్ మొత్తం పగిలిపోయింది. నా భర్త మీద దాడి చేసిన వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు. ఇటువంటి వ్యవస్థలో ఉన్నందుకు సిగ్గు అనిపిస్తోంది. నా భర్త ను చంపడానికి ప్రయత్నించారని” అసిస్టెంట్ ఎస్సై భార్య సీమ కన్నీటి పర్యంతమయ్యారు.

” బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో మా తాత పని చేశారు. 1971 యుథ్థంలో కూడా పాల్గొన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆందోళనలు జరుగుతున్నప్పుడు మా నాన్న అక్కడ విధులు నిర్వహించారు. ఉన్నట్టుండి కొంతమంది మా నాన్న మీద దాడి చేశారు. సీనియర్ అధికారులకు సెక్యూరిటీ ఇచ్చే క్రమంలో మా నాన్న గాయపడ్డారు. ఆయన తలకు నాలుగు కుట్లు పడ్డాయి. నేను కూడా ఒక స్టూడెంట్ నే. మా నాన్న కు చావు చివరి అంచులో తప్పిపోయింది. ఇప్పుడు మాక్కూడా న్యాయం చేయాలని” ఓ పోలీసు అధికారి కుమారుడు వాపోయారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper