Homeటాప్ స్టోరీస్Lok Sabha Rahul Gandhi : అనర్హుడు ప్రతిపక్ష నాయకుడయితే పార్లమెంటు ఎలా ఉంటుందో కళ్ళారా...

Lok Sabha Rahul Gandhi : అనర్హుడు ప్రతిపక్ష నాయకుడయితే పార్లమెంటు ఎలా ఉంటుందో కళ్ళారా చూస్తున్నాం

Lok Sabha Rahul Gandhi  : భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడి పాత్ర అత్యంత కీలకమైనది. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజా సమస్యలపై లోతైన చర్చలు జరపడం, విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నించడం ప్రతిపక్ష నాయకుడి ప్రధాన బాధ్యత. అయితే, ప్రస్తుత లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ తీరును గమనిస్తే, ఆ పదవికి ఉండాల్సిన గౌరవాన్ని, స్థాయిని ఆయన ఏమేరకు కాపాడుతున్నారనే ప్రశ్నకు ప్రతికూల సమాధానమే వస్తోంది. దేశ పార్లమెంటరీ చరిత్రను ఒక్కసారి తిరగేస్తే… […]

Lok Sabha Rahul Gandhi  : భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడి పాత్ర అత్యంత కీలకమైనది. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజా సమస్యలపై లోతైన చర్చలు జరపడం, విధానపరమైన నిర్ణయాలను ప్రశ్నించడం ప్రతిపక్ష నాయకుడి ప్రధాన బాధ్యత. అయితే, ప్రస్తుత లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ తీరును గమనిస్తే, ఆ పదవికి ఉండాల్సిన గౌరవాన్ని, స్థాయిని ఆయన ఏమేరకు కాపాడుతున్నారనే ప్రశ్నకు ప్రతికూల సమాధానమే వస్తోంది.

దేశ పార్లమెంటరీ చరిత్రను ఒక్కసారి తిరగేస్తే… గతాధిపతులు, పూర్వ ప్రతిపక్ష నాయకులు పార్లమెంట్‌లో ప్రసంగిస్తే వాదనలు తూటాల్లా పేలేవి. సభకు వచ్చేముందు సబ్జెక్టును క్షుణ్ణంగా అధ్యయనం చేసి , సమాచారంతో కూడిన ఘాటైన విమర్శలు చేసేవారు. వారి ప్రసంగాల్లో గంభీరత, డిగ్నిటీ, సబ్జెక్టుపై పట్టు స్పష్టంగా కనిపించేవి. కానీ, నేడు రాహుల్ గాంధీ వైఖరిని చూస్తుంటే ఆ సంప్రదాయాలన్నీ మసకబారినట్లే కనిపిస్తోంది.

“అనర్హుడైన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడి స్థానంలో కూర్చుంటే పార్లమెంట్ స్థాయి ఏ విధంగా దిగజారుతుందో అనడానికి ప్రస్తుత లోక్‌సభ పరిణామాలు ప్రత్యక్ష నిదర్శనం.”

గతంలో కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేతగా వ్యవహరించిన అధీర్ రంజన్ చౌదరి కూడా రాహుల్ గాంధీ కంటే ఎంతో నయమనిపిస్తోంది. అధీర్ విషయ పరిజ్ఞానంతో, ముందస్తు పరిశోధన చేసి సభకు వచ్చి తన వాదనలను వినిపించేవారు. కానీ రాహుల్ గాంధీ తీరు అందుకు భిన్నంగా ఉంది. సభకు చదువుకొని రాకపోవడం, విషయంపై అవగాహన లేకపోవడం ఆయన ప్రసంగాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

విషయాధారిత విమర్శలు చేయాల్సింది పోయి, కేవలం సభలో గొడవలు సృష్టించడం, రెచ్చగొట్టేలా మాట్లాడటమే ధ్యేయంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరి సభలో అసహనాన్ని, వికారాన్ని కలిగిస్తోంది. ఒకవేళ ఆయన ప్రసంగాల్లోని అనుచిత వ్యాఖ్యలపై అధికార పక్షం లేదా స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేస్తే… వెంటనే తన బాధితుడి పాత్ర బయటకు తీసి, “నా గొంతు నొక్కుతున్నారు” అంటూ వాపోవడం ఆయనకు అలవాటుగా మారింది.

పార్లమెంట్ అంటే కేవలం గొడవలు చేయడానికి, రాజకీయ రభస సృష్టించడానికి కేటాయించిన వేదిక కాదు. అక్కడ బాధ్యతాయుతమైన విమర్శలు ఉండాలి. ఒక సమర్థుడైన ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం వల్ల పార్లమెంట్ ప్రాధాన్యతే దెబ్బతింటోంది. తగిన అర్హత, విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి ఆ పదవిలో ఉంటే ప్రజాస్వామ్యం ఎంతగా వెలవెలబోతుందో నేడు దేశ ప్రజలు కళ్ళారా చూస్తున్నారు.

అనర్హుడు ప్రతిపక్ష నాయకుడయితే పార్లమెంటు ఎలా ఉంటుందో కళ్ళారా చూస్తున్నాం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper