India vs Pakistan : భారత్ యుద్ధానికి సిద్ధమైంది. 7వ తేదీ సివిల్ డిఫెన్స్ డ్రిల్ జరుగబోతోంది. పౌరులను యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నారు. దీనర్థం భారత్ యుద్ధానికి రెడీ అవుతుందని అంటున్నారు. టీవీలు, మీడియాలో యుద్ధంపై చర్చలు జరుగుతున్నాయి. దీనిపై వ్యతిరేకత వార్తలు సహేతుకం కాదు. ఇది ప్రభుత్వం, సైన్యం కలిసి చేసే యుద్ధం. భారత ప్రభుత్వం కూడా యుద్ధానికి ఆమోదయోగ్యం కాదు. కానీ పాక్ ఆగడాలు ఎక్కువయ్యాయి. ముంబై నగరం, పార్లమెంట్ పై దాడి, ఉరి, పుల్వామా, పహల్ గాంపై దాడులు సహించాం.. దేనికైనా హద్దు ఉండాలి. నిరాయుధులైన 26 మందిని పొట్టనపెట్టుకుంటే ఎన్నాళ్లు సహించాలి.
దేశం యావత్తూ ఒక్కటై నిలవాలి విభేదాలు వద్దు.. దేశం మొత్తం పహల్ గాం ఘటన విషయంలో కలతచెందింది. న్యాయం జరగాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. దీనికి యుద్దం కాక ఏది ప్రత్యామ్మాయం..
యుద్ధం లేకుండా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి. పాకిస్తాన్ మనం ఎంత శాంతి ప్రయత్నాలు చేసినా కవ్వించింది. నిరాయుధులు అయిన ప్రజలను మతం అడిగి చంపించింది. యుద్ధం అనర్థమే. దీనికి సొల్యూషన్ చెప్పమనండి.. యుద్ధానికి పరిష్కారం చెప్పమనండి.. ప్రశ్నించడం ఈజీ.. కానీ సమాధానం రాబట్టమే కష్టం.
దేశం యావత్తూ ఒక్కటై నిలవాలి విభేదాలు వద్దు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.