Homeఆధ్యాత్మికంToday 14 August 2026 Horoscope: ఈ 4 రాశుల వారికి ఈ రోజు లక్ష్మీదేవి...

Today 14 August 2026 Horoscope: ఈ 4 రాశుల వారికి ఈ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం.. డబ్బు మూటలు లెక్క పెట్టాల్సిందే..

Today 14 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై ముఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు ధనలక్ష్మీ యోగం కలగనుంది. మరికొన్ని రాశుల వారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధించే […]

Today 14 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై ముఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు ధనలక్ష్మీ యోగం కలగనుంది. మరికొన్ని రాశుల వారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఈ ప్రయాణాలతో లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. కొత్తగా పెట్టుబడుదు పెట్టడానికి ఇదే మంచి సమయం. కొత్తగా రుణం తీసుకుంటారు. దీర్ఘకాలికంగా ఉండే ప్రయోజనాల దృష్ట్యా పెట్టుబడులు పెడతారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు తమ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉంటుంది. దీంతో అనుకున్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని కలిసి వస్తాయి. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లోని రహస్యాలు ఎవరికి చెప్పకుండా ఉండాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్త. పెద్దల అండదండలతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. బడ్జెట్ లో దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెట్టాలి. భవిష్యత్తులో వచ్చే లాభాల కోసం ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని రిస్క్ తో కూడిన పనులు చేయాల్సి వస్తుంది. ఇవి విజయవంతం అయితే అన్ని ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉంటుంది.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారి కుటుంబ జీతం ఈరోజు సంతోషంగా సాగుతుంది. కొన్ని ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. డబ్బు పొదుపు గురించి ప్రత్యేకంగా ఆలోచించాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కార్యాలయాల్లో గొడవలు జరిగితే ఓపికతో ఉండాలి. ముఖ్యమైన ప్రాజెక్టును పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఇంటి నిర్మాణం కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త అప్పులను తీసుకునే అవకాశం ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాల్లో సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. కెరీర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు అత్యధిక లాభాలు పొందాలంటే మరింత కష్టపడాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ విషయంలో రోగతి సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. విదేశాల నుంచి శుభవార్తలో అందుతాయి. ఉద్యోగులు నాణ్యమైన ప్రదర్శన ద్వారా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల మానసికంగా ప్రశాంతతను పొందుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అనేక విషయాలు కలిసి వస్తుంది. అయితే కొత్త వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు పక్కనే ఉండి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వారికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటమే మంచిది. ఇంట్లోని రహస్యాలను ఇతరులకు చెప్పకూడదు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు స్నేహితులతో విభేదాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో మాట తీరును అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper