Balayya Babu and NTR : నందమూరి నటసింహం గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు (Balayya Babu)…ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సక్సెస్ సాధించే విధంగా సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట తను చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇప్పటికి వరుసగా నాలుగు విజయాలను సాధించిన ఆయన ఇకమీదట మరో విజయాన్ని కూడా సాధించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఇక నందమూరి ఫ్యామిలీ మూడోతరం బాధ్యతలను ముందుకు తీసుకెళుతున్నప్పటికి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు మంచి విజయాలు సాధిస్తూ వస్తున్నాయి. వరుసగా 7 సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించిన ఆయన ఇప్పుడు ఎనిమిదో విజయం మీద కూడా కన్నేసినట్టుగా తెలుస్తోంది… అయితే బాలయ్య బాబుకి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కి మధ్య గత కొన్ని రోజుల నుంచి మాటలు అయితే లేకుండా పోయాయి. వీళ్ళ మధ్య జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా మాట్లాడుకోవడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒకరి ఫంక్షన్స్ కి మరొక హాజరవ్వడం లేదు.
Also Read : బాలయ్య ఫ్యాన్స్ కి పండగే..’డాకు మహారాజ్’ ఓటీటీ వెర్షన్ లో 15 నిమిషాల సరికొత్త సన్నివేశాలు!
కారణం ఏదైనా కూడా వీళ్ళిద్దరి మధ్య కొద్ది రోజుల నుంచి సత్ సంబంధాలు అయితే లేకుండా పోతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో వాళ్లు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా వరకు పోటీ అయితే నెలకొంది. మరి నందమూరి అభిమానులు సైతం వీళ్ళు కలిస్తే బాగుండు అనే ఒక ఆలోచనతో ఉన్నారు.
కానీ వీళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళ మధ్య మాటలు లేవనే విషయాన్ని తమ అభిమానులకు గుర్తు చేస్తూ వస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వీళ్లిద్దరి మధ్య రీసెంట్ గా మాటలు కలిసాయి అనే కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక వీళ్ళ మధ్య మాటలు కలిపింది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ గా ఆయన ఒక పార్టీని చేసి అందులో బాలయ్య బాబుని, ఎన్టీఆర్ ని ఆహ్వానించి వాళ్లిద్దరి మధ్య సత్సంబంధాలను ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక రామ్ చరణ్ ఇటు బాలయ్య బాబు తో అటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరితో సన్నిహితంగా ఉంటారు. కాబట్టి రామ్ చరణ్ తో అయితేనే ఇది సాధ్యమవుతుందనే ఉద్దేశ్యంతో కొంతమంది సినీ రాజకీయ పెద్దలు కలిసి వాళ్ళిద్దరి మధ్య మాటలు కలిపే ప్రయత్నం చేయడానికే ఈ పార్టీ ని ఏర్పాటు చేశారనే వార్తలు వస్తున్నాయి. వీళ్ళిద్దరి మధ్య మాటలు కలిశాయా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.