Floods in Nepal: ఇంకా వేణు స్వామి గురించి ప్రస్తావన రాలేదు..సోషల్ మీడియాలో అతడి హడావుడి లేదు..అనుకుంటుంటే..నేనున్నా..నేను విన్నా అని వేణుస్వామి ఎంట్రీ ఇచ్చాడు. కాకా సినిమాలో చిరంజీవిలా.. కింగ్100లో నాగార్జున లా వీరలెవల్ ఎలివేషన్లతో రంగప్రవేశం చేశాడు వేణుస్వామి. ఆ మధ్య కామఖ్య దేవి ఆలయంలో వివాదం తర్వాత వేణుస్వామి అంతగా కనిపించలేదు. పైగా తాను జోష్యం చెప్పబోనని తెగేసి చెప్పేశాడు. మధ్యలో టీవీ5 మూర్తి తగులుగున్న తర్వాత వేణుస్వామి అంతగా కనిపించడం మానేశాడు.
ఇప్పడు అకస్మాత్తుగా వేణుస్వామి గురించి చర్చ మొదలైంది. వేణుస్వామి ఇప్పుడు ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు..అసలు ఏమైంది.. ఇంతకీ ఏం జరిగింది.. నేపాల్ ఆకస్మికంగా వరదలు వచ్చాయి గుర్తుందా.. ఆ వరదల వల్ల చాలా మందిప్రాణాలు కోల్పోయారు. విపరీతంగా ఆస్తి నష్టం జరిగింది. ఇప్పట్లో నేపాల్ కోలుకోవడం కష్టమే.ప్రపంచ దేశాలు సాయం చేసేందుకు ముందకువస్తున్నాయి. అయినప్పటికీ నేపాల్ ఒకప్పటి లాగా మారిపోవడం ఇప్పట్లో సాధ్యం కాదు. అక్కడచాలా వరకు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. బురదచాలా ప్రాంతాలను ముంచేసేంది. బండరాళ్లు విపరీతంగా వచ్చాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వంతెనలు నామరూపాలు లేకుండాపోయాయి. రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నేపాల్ ఇలా మారిపోవడం వెనుక చైనా ఉందని.. ,చైనా ఆక్రమించిన టిబెట్ ప్రాంతంలో వరదనీరు వల్ల ఇలా జరిగిందని గ్లోబల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నేపాల్ లో ఇలావరదలు రావడాన్ని ముందుగానే వేణుస్వామి అంచనా వేశారు. వరదల వల్ల నేపాల్ సర్వనాశనం అవుతుందని చెప్పారు. దీని వెనుక ఉన్నఅనేక కారణాలను వేణుస్వామి లెక్కలతో సహా వివరించారు. నేపాల్ లో వరదల వల్ల చాలా మంది నిరాశ్రయులవుతారని వేణుస్వామి చెప్పారు. ‘హిమాలయాలకు దగ్గరగా ఉన్న నేపాల్ దేశంలో వరదలు వస్తాయి. ఆ వరదల వల్ల నేపాల్ వణికిపోతుంది. ఆ వరదలను తట్టుకోవడం నేపాల్ వల్ల కాదు. దీనికి పరిష్కారం హిమలయాలను కాపాడుకోవడమే. ఇటీవల నేపాల్ లో జన్ జడ్ ఉద్యమం చేసింది. ఆ ఉద్యమంలో అపచారం జరిగింది. అది చివరికి నేపాల్ దేశాన్ని సర్వనాశనం చేసిందని’ వేణుస్వామి వ్యాఖ్యానించారు.
గతంలో నాగచైతన్య, సమంత వైవాహిక జీవితం మీద వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ విడిపోతారని వ్యాఖ్యానించారు. ఆయన చెప్పినట్టుగానే నాగచైతన్య, సమంత విడిపోయారు. కొద్దిరోజుల క్రితమే నేపాల్ లో వరదల గురించి వేణుస్వామి చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే అక్కడ వరదలు వచ్చాయి. ఈ లెక్కన ఒకప్పటి లాగా వేణుస్వామి ఫామ్ లోకి వచ్చినట్టే అనుకోవాలేమో..